NTV Telugu Site icon

ఇలా కూడా కరోనా సోకుతుంది.. పరిశోధకుల హెచ్చరిక

COVID 19

COVID 19

భారత్‌ను ఇప్పుడు కరోనా సెకండ్‌వేవ్ కలవర పెడుతోంది.. రికార్డుస్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక, కొత్త కొత్త లక్షణాలు కూడా బయటపడుతున్నాయి.. అయితే, కరోనా ఎలా సోకుతుందన్న దానిపై తాజాగా పరిశోధకులు హెచ్చరించారు.. ఇంటి నుంచి కాలు బయటపెట్టిన మనిషి.. ఎన్నో ప్రాంతాలను తాకుతాడు..! డబ్బులు సైతం చేతులు మారతాయి.. మళ్ళీ అది చేత్తో ఆహారం తీసుకోవడం లేదా చిరుతిండ్లు తినడం, శానిటైజర్‌ ఉపయోగించకుండా నోరు, ముక్కును ముట్టుకున్నా.. వైరస్‌ రావడం ఖాయం. మాస్క్ పెట్టుకోకుండా.. చేతులను శుభ్రం చేసుకోకుండా.. కనీస జాగ్రత్తలు పాటించకుండా ఉంటడం వలన ఒకరి నుంచి ఒకరికి సర్ఫేస్ కాంటెక్ట్ ద్వారా కరోనా వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఉపరితలన్నీ తాకడం కరోనా వైరస్ సంక్రమించే ఛాన్స్ కొంచం తక్కువ అంటున్నారు.

పేపర్, గ్లాస్, తడి ప్రదేశాల మీద కరోనా వైరస్ ఇరవై ఎనిమిది రోజుల వరకూ ఉండగలదు. వైరస్‌తో ఇన్‌ఫెక్ట్ అయిన వ్యక్తి తాకిన సర్ఫేస్‌ని మరెవరైనా తాకితే వారికి కూడా ఇన్‌ఫెక్షన్ సోకవచ్చుని డాక్టర్లు అంటున్నారు. అందుకే ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రం చేసుకోవడం.. శానిటైజర్‌తో చేతులు కడుక్కోవడం చేయాలని సూచిస్తున్నారు. కలుషితమైన ఉపరితలం లేదా వస్తువును తాకడం ద్వారా కరోనావైరస్ సంక్రమించే ప్రమాదం తక్కువ అని అమెరికాకు చెందిన సీడీసీ స్పష్టం చేసింది. ప్రతి రోజు ఇంట్లో పరిసరాలను శానిటైజ్ చేయడం ద్వారా కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చు. సిడిసి ప్రకారం, ఉపరితలాల నుండి కోవిడ్ -19 కు సంక్రమించే అవకాశం 1-లో 10,000 కంటే తక్కువ అని పేర్కొంది.