Site icon NTV Telugu

Republic Day: గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26 నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Republic Day

Republic Day

మరో మూడురోజుల్లో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు.. ఈ వేడుకను ఘనంగా జరుపుకోవడం కోసం దేశం సిద్ధం అవుతుంది.. డిల్లీ వీధుల్లో ఇప్పటికే గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.. చాలా మందికి ఈరోజు గురించి తెలియదు.. అసలు ఇన్ని రోజులు ఉండగా జనవరి 26 నే ఎందుకు జరుపుకుంటారో చాలా మందికి తెలియదు.. ఆ రోజు ప్రత్యేకం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జనవరి 26న, భారత రాజ్యంగం అమల్లోకి రావడంతో రిపబ్లిక్​ డేని జరుపుకుంటాము.. 1947 ఆగస్ట్​ 15న ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చింది. ఇండియాకు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని అప్పటికే చాలా మంది పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని నిర్మించేందుకు ఆగస్టు చివర్లో డాక్టర్ అంబేద్కర్ నేత్రుత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.. రాజ్యాంగాన్ని నిర్మించేందుకు ఈ కమిటీ ఎంతో కృషి చేసింది. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2ఏళ్ల, 11 నెలల, 18 రోజుల సమయం పట్టింది. ఇక చివరగా 1949 నవంబర్​ 26న.. రాజ్యాంగాన్ని అడాప్ట్​ చేసుకున్నారు..

అయితే ఆరోజుల్లో అమలు చెయ్యలేదు.. కొన్ని సర్దుబాట్లు చేసుకొని రెండు నెలలకు అంటే జనవరి 26 న అమల్లోకి తీసుకొచ్చారు..1930 జనవరి 26న.. తొలిసారిగా పూర్ణ స్వరాజ్​ (సంపూర్ణ స్వాతంత్ర్యం) నినాదాన్ని ఇచ్చింది కాంగ్రెస్​. దేశ చరిత్రలో అదొక కీలక ఘట్టంగా భావిస్తూ ఉంటారు.. ఆ తర్వాత 20 ఏళ్లకు జనవరి 26 న అమల్లోకి తీసుకొని వచ్చారు.. దాన్నే రిపబ్లిక్ నేషన్ గా చెబుతారు.. అప్పటి నుంచి ప్రతియేటా గణతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి.. మువ్వన్నెల జెండాను ఆ రోజున ఎగుర వేస్తారు.. ఒక సంబరంగా ఊరు, వాడా జరుపుకుంటారు.. అదన్నమాట అస్సలు విషయం..

Exit mobile version