Site icon NTV Telugu

బీజేపీ లేనేలేదు… అది ఈటల గెలుపు : రేణుకా చౌదరి

హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితం టీఆర్‌ఎస్‌ పార్టీ కంటే… కాంగ్రెస్‌ పార్టీ లోనే ఎక్కువగా కుంపటి పుట్టిస్తోంది. హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాభవానికి కారణం రేవంత్‌ రెడ్డినే చేస్తున్నారు సీనియర్లు. ఇక తాజాగా.. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు రేణుకా చౌదరి… కూడా హుజురాబాద్‌ ఫలితంపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో… గెలుపు.. ఓటములు సహజమని…. కోమటి రెడ్డి వ్యాఖ్యలు సరైనవే…కానీ బయట మాట్లాడకుండా ఉండాలన్నారు.

పార్టీ వ్యవహారాలు పార్టీ వేదికపై మాట్లాడాలని తెలిపారు. హుజురాబాద్‌ లో అసలు బీజేపీ లేనే లేదని… అక్కడి గెలుపు ఈటెల రాజేందర్‌ ది అని స్పష్టం చేశారు. ఆ గెలుపు.. బీజేపీ కాదన్నారు. అక్కడ బీజేపీ ఎక్కడ ఉందని… ఈటల కోసం స్థానిక నాయకులు కూడా పనిచేశారని తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో ఫలితాలు ఇలా కూడా వస్తుంటాయని.. వాటిపై సమీక్ష చేసుకుంటామన్నారు ణుకా చౌదరి.

Exit mobile version