NTV Telugu Site icon

Jio 601 Recharge Plan: ఏడాది పాటు 5G డేటా అన్‌లిమిటెడ్ ప్లాన్‌ను విడుదల చేసిన జియో..

Jio

Jio

Jio 601 Recharge Plan: రిలాయన్స్ జియో తన యూజర్ల కోసం మరింత సౌకర్యవంతమైన, అధిక విలువ కలిగిన 5G డేటా ప్లాన్‌ను లాంచ్ చేసింది. జియో కొత్తగా 601 రూపాయల వోచర్‌ను విడుదల చేసింది. దీనితో జియో యూజర్లు తాము వాడుతున్న ప్రస్తుత ప్లాన్‌పై అనలిమిటెడ్ 5G డేటా సేవలు ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ రోజువారీ 1.5GB 4G డేటా లేదా ఎక్కువ డేటా అందించే ప్లాన్‌తో జియో యూజర్లు ఈ వోచర్‌ను పొందవచ్చు. ఇది 12 నెలల కాలపరిమితితో అద్భుతమైన 5G అనుభవాన్ని అందిస్తుంది.

Also Read: Cristiano Ronaldo: మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసిన రొనాల్డో.. (వీడియో)

ఇకపోతే, జియో 601 రూపాయల వోచర్‌ను ఎలాంటి ప్లాన్లలో ఉపయోగించవచ్చో తెలుసుకోవడానికి, ముందు యూజర్లకు ఒక 4G డేటా ప్లాన్ ఉండాలి. అందులో రోజుకు కనీసం 1.5GB డేటా అందించాలి. జియో 199, 239, 299, 319, 329, 579, 666, 769, 899 వంటి ప్లాన్లతో ఈ వోచర్‌ పనిచేస్తుంది. అయితే, 1GB డేటా ప్లాన్ లేదా 1,899 రూపాయల వార్షిక రిచార్జ్ ప్లాన్ వాడుతున్న యూజర్లకు ఈ వోచర్ పనిచేయదు. ఈ వోచర్‌ను కొనుగోలు చేసినప్పుడు, యూజర్లు 12 అప్గ్రేడ్ వోచర్‌లను పొందుతారు. ఈ వోచర్‌లను MyJio యాప్ ద్వారా వాడుకోవచ్చు. ప్రతి వోచర్‌తో జియో యూజర్లు అనలిమిటెడ్ 5G డేటా, ప్రతిరోజూ 3GB అదనపు 4G డేటా పొందవచ్చు. ఈ వోచర్ ప్లాన్ వ్యవధి మీ ప్రస్తుత ప్లాన్‌ల ఆధారంగా ఉంటుంది. ఇందులో ప్రతి వోచర్ గరిష్టంగా 30 రోజులు మాత్రమే పని చేస్తుంది.

ఈ వోచర్‌ను ఉపయోగించడానికి, యూజర్లకు ముందుగా జియో యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా MyJio యాప్ ద్వారా 601 రూపాయల డేటా వోచర్ కొనడం అవసరం. ప్రతి వోచర్ 1 నెల పాటు అనలిమిటెడ్ డేటా ఫలితాన్ని అందిస్తుంది. ఈ వోచర్లను MyJio యాప్‌లో ‘My Vouchers’ సెక్షన్ ద్వారా రిడీమ్ చేయవచ్చు. ఈ 601 రూపాయల ప్లాన్‌ను మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు గిఫ్ట్‌గా కూడా ఇవ్వవచ్చు. MyJio యాప్ ద్వారా మీరు ఈ వోచర్‌ను నేరుగా కొనుగోలు చేసి, వేరే యూజర్లకు గిఫ్ట్ చేయవచ్చు. గిఫ్ట్ చేయాలనుకుంటే, మీరు ధృవీకరించాల్సిన విషయమేమిటంటే.. వాడుతున్న ప్లాన్ 1.5GB లేదా అంతకంటే ఎక్కువ డేటా అందిస్తుండాలి. జియో 601 రూపాయల వోచర్‌తో పాటు, జియో ఇతర చిన్న 5G అప్‌గ్రేడ్ ప్లాన్లను కూడా అందిస్తుంది. ఇవి 51, 101, 151 రూపాయల ధరతో ఉన్నాయి.