NTV Telugu Site icon

Red wine: రోడ్డుపై నదిలా పారిన రెడ్ వైన్.. చూస్తే మందుబాబులు అల్లాడాల్సిందే

Wine

Wine

Red wine Flowed as River in The Streets of Portugal: మందు బాబులు మద్యాన్ని ఎంత అపురూపంగా చూసుకుంటారంటే ఒక్క చుక్క కిందపడినా ప్రాణం పోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. చివరి లక్కీ డ్రాప్స్ ను కూడా ఎంతో ఆశ్వాదిస్తూ తాగుతారు. ఇక అలాంటిది మద్యం నిజంగానే నదిలా పారుతూ ఉంటే వారికి ఎలా ఉంటుంది చెప్పండి. అయ్యాయ్యో వేస్ట్ అయిపోతుందే అంటూ ప్రాణం విలవిలలాడిపోదూ. అయితే నిజంగా మద్యం రోడ్డుపై ఏరులై పారింది. అయితే అది మన దేశంలో కాదు పోర్చుగల్ లో. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Congress: ముంబైని “యూటీ” చేయాలనుకుంటుంది.. అందుకే పార్లమెంట్ సమావేశాలు..

పోర్చుగల్ లోని లెవీరా పట్టణంలో ఉన్న ఓ కంపెనీలో రెడ్ వైన్ చాలా ఎక్కువ మోతాదులో తయారు చేస్తూ ఉంటారు. తరువాత వాటిని పైప్స్ ద్వారా పెద్ద పెద్ద ట్యాంకుల్లోకి ఎక్కిస్తూ ఉంటారు. అక్కడి నుంచి వాటిని బ్యాటిల్స్ లో నింపి మార్కెట్ కు తీసుకువెళతారు. అయితే ఎప్పటిలాగానే ఇలా చేస్తూ ఉంటే ఆదివారం ఊహించని సంఘటన జరిగింది. మద్యం నిల్వ చేసే ట్యాంకర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో వాటిలో ఉన్న 2.2 మిలియన్ లీటర్ల రెడ్ వైన్ నేల పాలయ్యింది. కంపెనీ నుంచి అది రోడ్డుపైకి వచ్చేసి వరదల మారింది. అక్కడ రోడ్డు కొంచెం పల్లంగా ఉండటంతో నిజమైన నది ప్రవహించినట్లుగానే రెడ్ వెన్ ప్రయాణించింది. దగ్గరలో నది ఉండటంలో ఈ వైన్ అంతా అటు వైపు వెళ్లసాగింది. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎమర్జెన్సీ టీంలు వైన్ నీటిలో కలిసి కలుషితం కాకుండా దారి మళ్లించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంత మొత్తంలో వైన్ వేస్ట్ అవుతుంటే ప్రాణం ఉసూరుమంటుందని ఈ వీడియో చూసిన చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

Show comments