బెండకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి.. అందుకే వీటిని తినమని వైద్యులు సూచిస్తున్నారు.. అయితే మనం ఇప్పటివరకు ఆకుపచ్చ లేదా లైట్ కలర్ చిలకపచ్చ రంగులో ఉండే వాటిని చూస్తుంటాం.. కానీ ఎరుపురంగు బెండకాయలు బెండకాయలు కూడా ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు.. కానీ ఈ బెండకాయ సాగుతో అధిక లాభాలను కొందరు రైతులు పొందుతున్నారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లాభాలను పొందుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మిశ్రిలాల్ రాజ్‌పుత్ బనారస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ సెంటర్‌కు వెళ్లాడు. ఈ బెండకాయలను ఎంచుకొని ఛాలెంజి తీసుకోని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాడు..అతని వ్యవసాయ ఇన్‌స్టిట్యూట్ నుండి ఒక కేజీ రెడ్ లేడీఫింగర్ విత్తనాలను రూ.2400కు కొనుగోలు చేశాడు.. ఈ కాయలు మంచి దిగుబడిని ఇస్తాయి.. ఒక్కో చెట్టుకు 60 కాయల వరకు కాస్తయని నిపుణులు చెబుతున్నారు.. మంచి ధర కూడా ఉండటం వల్ల లాభాలు బాగానే ఉంటాయని చెబుతున్నారు..
ఇకపోతే వీటిని తినడం వల్ల గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ మరియు మధుమేహం ఉన్న రోగులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.ఈ కాయల చాలా ధర కూడా ఉంటాయి.3 నుండి 4 రెట్లు ఎక్కువ. రెడ్ లేడీఫింగర్ విక్రయించడం ద్వారా రైతులు కిలోకు రూ.300 నుంచి 400 వరకు సంపాదించవచ్చు. ఈ రెడ్ లేడీఫింగర్ పంటకు నష్టం జరిగే అవకాశం కూడా తక్కువ..ఈ బెండ రంగు ఎరుపు కారణంగా ఎక్కువ పురుగులు కూడా ఆకర్షించవు…. సో లాభాలే లాభాలు.. ఈ పంట గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది..