Site icon NTV Telugu

Beer Sales: రికార్డు స్థాయిలో బీర్ల విక్రయాలు.. ఎండల ఎఫెక్ట్‌ అలా ఉంది మరి..!

Beer

Beer

Beer Sales: రాత్రి నుంచి హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. .కానీ, ఎండలు మాత్రం మండిపోతున్నాయి. ఉపసమనం కోసం వైన్‌ షాపులకు పరిగెడుతున్నారు మందుబాబులు. బీరు తాగి వేసవి తాపం నుంచి ఉపశమనం పొండుతున్నారు. ఫలితంగా మద్య అమ్మకాలు భారీగా పెరిగాయి. తెలంగాణలో పక్షం రోజుల్లో 35 లక్షల కాటన్లు ఖాళీ అయ్యాయి. ఈ నెలలో తెలంగాణలో రికార్డుస్థాయిలో బీర్లు అమ్మకాలు జరిగాయి. 18 రోజుల్లో 4 కోట్ల 23 లక్షల బాటిళ్లు అమ్ముడుపోయాయి. వీటి విలువ అక్కరాల 5 వందల 82 కోట్ల 99 లక్షల రూపాయలు. .

Read Also: Vijay Antony: ‘బిచ్చగాడు’ని ఆపేదెవరు!?

ఈ నెల ఎండలు మండిపోతుండడం వల్ల ఉపశమనం కోసం బార్లు, వైన్‌ షాపులకు పరుగులుతీస్తున్నారు మందుబాబులు. ఎక్కువ మంది బార్ల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ నెల ఒకటో తారీఖు నుంచి 18 వరకు 35 లక్షల 25 వేల 247 కాటన్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్కో కాటన్లో పన్నెండు బీరు సీసాలుంటాయి. ఈ లెక్కన సగటున రోజుకు 23 లక్షల 50 వేల 164 సీసాలు ఖాళీ అయ్యాయి. బీర్ల అమ్మకాల్లో నల్గొండ జిల్లా ఆగ్రస్థానంలో ఉంది. నల్గొండ జిల్లాలో 18 రోజుల్లో 3 లక్షలకు పైగా కార్టన్ల బీర్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ 48 కోట్ల 14 లక్షల రూపాయలు. ఈ విషయంలో కరీంనగర్‌ జిల్లా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఎండలు మండిపోతుండడం వల్ల మద్యం విక్రయాలు ఇలాగే కొనసాగే సూచనలున్నాయి. ఫలితంగా నెలకరు నాటికి మద్యం అమ్మకాల రూపంలో ప్రభుత్వ ఖజానాకు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కాగా, సాధారణ రోజుల్లో మద్యం అమ్మకాలు ఎలా ఉన్నా.. వేసవిలో మాత్రం బీర్లకు భలే గిరాకీ ఉంటుంది.. ఎప్పుడూ లేనంతా బీర్లు తెగ తాగేస్తుంటారు మందు బాబులు.. కూల్‌ కూల్‌గా బీర్లు తాగుతూ.. ఎండల నుంచి ఉపశమనం పొందుతుంటారు.

Exit mobile version