Site icon NTV Telugu

National Parties: దేశంలో జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన ఇవే..

06

06

National Parties: భారత దేశంలో రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా శనివారం 334 నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. ఒక పార్టీ వరుసగా 6 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేయకపోతే, దానిని నమోదైన పార్టీల జాబితా నుంచి తొలగిస్తారని ఈసీ స్పష్టం చేసింది. ఇప్పుడు దేశంలో 6 జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర పార్టీలు, 2854 నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉన్నాయని ఈసీ తెలిపింది.

READ MORE: Pulivendula ZPTC By Elections: 30 ఏళ్లుగా ఏకగ్రీవం.. ఆసక్తికరంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక..

ఆరు జాతీయ పార్టీలు..

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)
2012 నవంబర్ 26 న సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రివాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్లు కోసం జరిగిన ప్రజాపోరాటం నుంచి ఆవిర్భవించింది. 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ పార్టీ మొత్తం 70 సీట్లలో 28 సీట్లు సాధించి రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలో మొత్తం 70 శాసనసభ స్థానాల్లో 67 సీట్లను సాధించి అధికారంలోకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు పోటీ చేసి 92 సీట్లు గెలుచుకుంది. పంజాబ్ సీఎంగా భగవంత్ సింగ్ మాన్ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ జాతీయ కన్వీనర్‌గా అరవింద్ కేజ్రివాల్ ఉన్నారు. ఈ పార్టీ ఎన్నికల సింబల్ చిపురు. తాజాగా ఎన్నికల సంఘం ఈ పార్టీకి జాతీయ హోదాను కల్పించింది.

బహుజన్ సమాజ్ పార్టీ (BSP)
1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీని కాన్షి రామ్ స్థాపించారు. ఒక ఓటు-ఒక నోటు అనే నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లి వారిచ్చే డబ్బుతోనే ప్రచారం చేశాడు. కులాన్ని కులంతోనే జయించాలని.. ఆయన కులాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకున్నారు. యూపీలోని చమార్లనే పునాదిగా చేసుకొని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కాశ్మీర్, బీహార్, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో ఇతర కులాలను కలుపుకొని పార్టీని బలోపేతం చేశాడు. కాన్షీరామ్ 2001లో తన వారసురాలిగా తన శిష్యురాలు మాయావతిని నియమించారు. ప్రస్తుత పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా మాయావతి కొనసాగుతున్నారు. ఈ పార్టీ ఎన్నికల గుర్తు ఏనుగు. తాజాగా ఎన్నికల సంఘం ఈ పార్టీకి జాతీయ హోదాను కల్పించింది.

భారతీయ జనతా పార్టీ (BJP)
బీజేపీ మూలాలు భారతీయ జనసంఘ్‌లో ఉన్నాయి. 1975–1977 అత్యవసర పరిస్థితి తర్వాత, జనసంఘ్ అనేక ఇతర రాజకీయ పార్టీలతో విలీనం అయ్యి జనతా పార్టీని ఏర్పాటు చేసింది. 1977 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికారంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెస్‌ను ఓడించి, మూడు ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత, 1980లో జనతా పార్టీ రద్దు చేయబడింది. బీజేపీ పార్టీ వ్యవస్థాపక సభ్యులు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, నానాజీ దేశ్ ముఖ్, కెఆర్ మల్కాని, సికందర్ బఖ్, విజయ్ కుమార్ మల్హోత్రా, విజయ రాజే సింధియా, బైరోన్ సింగ్ షెకావత్, శాంత కుమార్, రామ్ జెఠ్మలానీ, జగన్నాధరావు జోషిలు. బీజేపీ ప్రస్థానం మొదట రెండు స్థానాలతో ప్రారంభమై తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి చుట్టూ జరిగిన ఉద్యమం నేపథ్యంలో బలం పుంజుకుని అనేక రాష్ట్రాల్లో పాగ వేసింది. పార్టీ ఎన్నికల చిహ్నం కమలం పువ్వు. ప్రస్తుతం ఈ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. తాజాగా ఈ పార్టీకి ఎన్నికల సంఘం జాతీయ హోదాను ఇచ్చింది.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (CPI-M)
1950 లలో రష్యా, చైనా కమ్యూనిస్టుల మధ్య చీలిక రావడం, భారతదేశం – చైనా మధ్య 1962 సరిహద్దు ఘర్షణ, సిద్ధాంత భేదాలు రావడంతో కొందమంది సభ్యులు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) తో విడిపోయి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ( సిపిఐ (ఎం)) ను ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టు ఆఫ్ ఇండియా (మార్కిస్టు) స్థాపనకు నాంది పలికిన వారిని ఆ పార్టీ సభ్యులు అందరు నవరత్నములుగా పిలుస్తారు.. పి. సుందరయ్య (ఆంధ్రప్రదేశ్), E.M.S. నంబూద్రిపాద్ (కేరళ), హర్కిషన్ సింగ్ సుర్జీత్ (పంజాబ్), ప్రమోడ్ దాస్‌గుప్తా (పశ్చిమ బెంగాల్), ఎ.కె.గోపాలన్ (కేరళ), బి.టి.రణదీవ్ (ఆంధ్రప్రదేశ్), ఎం. బసవపున్నయ్య (ఆంధ్రప్రదేశ్), పి.రామమూర్తి (తమిళనాడు), జ్యోతి బసు (పశ్చిమ బెంగాల్) వీరు కమ్యూనిస్టు ఆఫ్ ఇండియా (మార్కిస్టు) స్థాపనకు నాంది పలికింది. ప్రస్తుతం ఈ పార్టీ కేరళలో అధికారంలో ఉంది. తాజాగా ఈ పార్టీకి ఎన్నికల సంఘం జాతీయ పార్టీ గుర్తింపును ఇచ్చింది.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ( ఏఐసిసి)
భారతదేశంలోనే అత్యంత ప్రాచీన పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ( INC ).. దీనిని కాంగ్రెస్ పార్టీ అని పిలుస్తారు. ఈ పార్టీ మహాత్మా గాంధీ నాయకత్వంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విశేషంగా పోరాడింది. అంతటి చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి 2014 నుంచి 2024 వరకు సార్వత్రిక ఎన్నికల్లో వరుస వైఫల్యాలు చుట్టుముట్టాయి. 2024 లో ఈ పార్టీ పార్లమెంట్‌లో 99 సీట్లను గెలుచుకుని అధికారిక ప్రతిపక్షంగా ఏర్పడింది. ఈ పార్టీ ఎన్నికల చిహ్నం హస్తం. తాజా ఈ పార్టీకి ఎన్నిల సంఘం జాతీయ పార్టీ గుర్తింపును ఇచ్చింది.

నేషనల్ పీపుల్స్ పార్టీ (NCP)
నేషనల్ పీపుల్స్ పార్టీ భారతదేశంలో ఒక సంప్రదాయవాద జాతీయ రాజకీయ పార్టీ. ఇది ఎక్కువగా మేఘాలయలో కేంద్రీకృతమై ఉంది. జూలై 2012లో NCP నుంచి బహిష్కరించబడిన తర్వాత PA సంగ్మా స్థాపించారు. దీనికి 7 జూన్ 2019న జాతీయ పార్టీ హోదా లభించింది. ఈశాన్య భారతదేశం నుంచి ఈ హోదా పొందిన మొదటి రాజకీయ పార్టీ ఇది. 2014 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ ఖర్చును అందించడంలో విఫలమైనందుకు 2015 లో ఎన్నికల సంఘం NPP ని సస్పెండ్ చేసింది. EC ద్వారా సస్పెండ్ చేయబడిన మొదటి పార్టీగా NPP నిలిచింది. 2023 మే 6న, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీలో విలీనమైంది. ఈ పార్టీ చిహ్నం ఒక పుస్తకం. తాజా ఈ పార్టీకి ఎన్నికల సంఘం జాతీయ పార్టీ హోదాను ఇచ్చింది.

READ MORE: Surprising Reasons : అది మాల్ అయినా, థియేటర్ అయినా, టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది..?

Exit mobile version