Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్‌, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..

Batter

Batter

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా రియల్‌మీ తన ‘పి4 సిరీస్’ స్మార్ట్‌ఫోన్‌లపై రూ.4,000 వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా రియల్‌మీ పి4 సిరీస్‌లోని ఐదు అద్భుతమైన ఫోన్‌లు ప్రత్యేక ధరలకు లభించనున్నాయి. రియల్‌మీ పి4ఎక్స్ 5జీ (Realme P4x 5G) 6GB+128GB వేరియంట్ అసలు ధర రూ.26,999 కాగా, రూ.4,000 తగ్గింపుతో రూ.22,999కే లభిస్తుంది.

ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్, 7000mAh బ్యాటరీ, 45W చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అలాగే రియల్‌మీ పి4ఎస్ 5జీ 8GB+128GB మోడల్ రూ.3,000 తగ్గింపు తర్వాత రూ.31,999కి అందుబాటులో ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్, 8000mAh భారీ బ్యాటరీ , 80W ఫాస్ట్ చార్జింగ్‌ను కలిగి ఉంది.

రియల్‌మీ పి4 5జీ (Realme P4 5G) రూ.1,000 తగ్గింపుతో రూ.29,999 ధరకు అందుబాటులో ఉంది. ఇందులో 144Hz హైపర్‌గ్లో అమోలెడ్ డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ మరియు 80W చార్జింగ్ సపోర్ట్ ఇవ్వబడ్డాయి. రియల్‌మీ పి4 ప్రో 5జీ (Realme P4 Pro 5G) స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 50ఎంపి సోనీ మెయిన్ కెమెరా మరియు 7000mAh బ్యాటరీతో రూ.30,999కి విక్రయించబడుతుంది.

చివరిగా, రియల్‌మీ పి4ఆర్ 5జీ (Realme P4R 5G) 4GB+64GB మోడల్ రూ.19,999 ధరతో లభిస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50ఎంపి ప్రైమరీ కెమెరా మరియు శక్తివంతమైన 8000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ ద్వారా తక్కువ ధరకే గొప్ప ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే అవకాశం వినియోగదారులకు లభిస్తోంది.