Realme P3 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త రియల్‌మీ P3 5G ఫోన్‌ను భారతదేశంలో నేడు (మార్చి 26)న విడుదల చేసింది. ఇక ఈ రియల్‌మీ P3 5G మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 6GB + 128GB మోడల్ అసలు ధర రూ. 16,999గా ఉండగా.. బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ. 14,999కే అందుబాటులోకి వచ్చింది. అలాగే 8GB + 128GB వెర్షన్ రూ.17,999 ధరతో విడుదల కాగా, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ. 15,999కి లభిస్తుంది. అలాగే, 8GB + 256GB వేరియంట్ రూ.19,999 కాగా బ్యాంక్ ఆఫర్‌తో కేవలం రూ. 17,999కే అందుబాటులో ఉంది. అంటే ప్రతి వేరియంట్ మొబైల్ ఫై రూ.2000 ప్రత్యేక డిస్కౌంట్ అందించారు. ఈ ఫోన్‌ను రియల్‌మీ వెబ్ సైట్, ఫ్లిప్కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
Read Also: Manchu Vishnu : ప్రభాస్ ఆ పనిచేస్తే నేను కన్నప్ప చేసేవాడిని కాదు : మంచు విష్ణు
రియల్‌మీ P3 5G స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో.. 6.67-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్, 1500Hz టచ్ సంప్లింగ్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఆధునిక ఫీచర్లను అందిస్తుంది. ప్రాసెసింగ్ పరంగా Snapdragon 6 Gen 4 (4nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉపయోగించారు. అలాగే ఇందులో పొందుపరిచిన Adreno 810 GPU ద్వారా మెరుగైన గేమింగ్ అనుభవం కూడా పొందొచ్చు. ఇక ముఖ్యమైన కెమెరాల విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ కెమెరా (f/1.8 అపర్చర్, LED ఫ్లాష్), 2MP పోర్ట్రైట్ కెమెరా, అలాగే 16MP సెల్ఫీ కెమెరా (f/2.4 అపర్చర్) కలిగి ఉంది. భద్రతా ఫీచర్లలో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించబడింది. ఆడియో పరంగా చూస్తే.. USB Type-C ఆడియో, స్టీరియో స్పీకర్స్ కలిగి ఉండడం వల్ల మ్యూజిక్ లవర్స్‌కు మొబైల్ మంచి ఎంపిక కానుంది.
ఈ ఫోన్‌లో 6000mAh భారీ బ్యాటరీ ఉండగా, అందుకు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించబడింది. కనెక్టివిటీ ఫీచర్లలో 5G, డ్యుయల్ 4G VoLTE, Wi-Fi 6 (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.2, NFC, USB Type-C అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి ప్రీమియమ్ ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్, AMOLED డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీతో రియల్‌మీ P3 5G మార్కెట్లో బడ్జెట్ రేంజ్ మొబైల్స్ లో గట్టి పోటీ ఇస్తోంది.