NTV Telugu Site icon

Realme Narzo 70 Pro 5G Price: మార్చి 19న మార్కెట్‌లోకి రియల్‌మీ నార్జో 70 ప్రో.. ధర, ఫీచర్లివే!

Realme Narzo 70 Pro 5g

Realme Narzo 70 Pro 5g

Realme Narzo 70 Pro 5G Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ భారత మార్కెట్‌లోకి వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. ఈ ఏడాది 12 ప్రో 5జీ, 12 సిరీస్‌ను లాంచ్ చేసిన రియల్‌మీ.. మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. మార్చి 19న భారత మార్కెట్‌లోకి ‘రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ’ ఫోన్ రిలీజ్ చేయనుంది. ఈ నెల 19 మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ విడుదల చేస్తోంది. లాంచ్ ఈవెంట్ రియల్‌మీ యూట్యూబ్, ఎక్స్ మరియు ఫేస్‌బుక్‌ ఖాతాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ భారతదేశపు మొట్టమొదటి సోనీ ఐఎంఎక్స్ 890 కెమెరాని కలిగి ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. డుయో టచ్ గ్లాస్ డిజైన్‌ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. భారతదేశంలో రూ. 25,000 కంటే తక్కువ ధరలో గ్లాస్ డిజైన్ అందించడం ఇదే మొదటిసారి. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్‌తో ఇది అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌తో ‌ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్‌ను రీ డిఫైన్ చేస్తున్నట్లు తెలిపింది.

Also Read: Hyundai Creta N Line Price: భారత మార్కెట్‌లోకి ‘హ్యుందాయ్‌ క్రెటా ఎన్‌లైన్’.. ధర, బుకింగ్ డీటెయిల్స్ ఇవే!

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కి మద్దతుతో రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని టీజర్‌ ద్వారా  చెప్పవచ్చు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్‌మీ యూఐ 5.0 వర్షన్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. 6.7 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్ జెన్ 2 చిప్ సెట్, 67 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఇందులో ఉండే అవకాశం ఉంది.