అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!

  • Realme Buds Air 8 Pro భారత్‌లో అధికారికంగా లాంచ్
  • 11mm డైనమిక్ బాస్ డ్రైవర్ + 6mm మైక్రో ప్లానర్ ట్వీటర్‌తో డ్యూయల్ డ్రైవర్ సెటప్
  • ఒక్కసారి ఛార్జ్‌తో 12 గంటల ప్లేబ్యాక్
  • ఛార్జింగ్ కేసుతో కలిపి మొత్తం 50 గంటల బ్యాటరీ బ్యాకప్
  • ధూళి, నీటి నిరోధకత కోసం IP55 రేటింగ్
  • భారత్‌లో ధర రూ. 6,999, లాంచ్ ఆఫర్ కింద రూ. 300 వరకు డిస్కౌంట్..
Realme Buds Air 8 Pro

Realme Buds Air 8 Pro

Realme Buds Air 8 Pro Launched: స్మార్ట్ డివైస్‌ల మార్కెట్లో రియల్‌మీ (Realme) నుండి Realme Buds Air 8 Pro TWS ఇయర్‌ బడ్స్ ను భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త ఇయర్‌బడ్‌లు Realme 16T స్మార్ట్‌ఫోన్, రియల్‌మీ Watch S5తో కలిసి లాంచ్ అయ్యాయి. ఇందులో కోయాక్షియల్ డ్యూయల్ డ్రైవర్ ఆడియో సిస్టమ్‌ను అందించారు. 11mm డైనమిక్ బాస్ డ్రైవర్‌తో పాటు 6mm మైక్రో ప్లానర్ ట్వీటర్‌ను కూడా ఇందులో అమర్చారు. దీంతో లో, మిడ్, హై ఫ్రీక్వెన్సీలలో క్లియర్ & బ్యాలెన్స్‌డ్ ఆడియో అనుభూతి లభించనుంది. ఈ ఇయర్‌బడ్‌లు 20Hz నుంచి 40kHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్‌ను సపోర్ట్ చేస్తాయి. అలాగే LHDC 5.0 Hi-Res వైర్‌లెస్ ఆడియో కోడెక్ సపోర్ట్ కూడా అందించారు.

వీటి ద్వారా కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు ప్రతి ఇయర్‌బడ్లో 3 చొప్పున మొత్తం 6 మైక్రోఫోన్లు ఉన్నాయి. బోన్ కండక్షన్ టెక్నాలజీ ఆధారిత ప్రత్యేక “వాయిస్ ప్రాసెసింగ్ యూనిట్”ను కూడా ఇందులో అందించారు. AI ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్ సహాయంతో కాల్స్ సమయంలో చుట్టుపక్కల శబ్దాన్ని తగ్గించి స్పష్టమైన వాయిస్‌ను అందిస్తుందని రియల్‌మీ తెలిపింది.

ఈ ఇయర్‌బడ్స్ లో అడాప్టివ్ ANC ఫీచర్‌ను అందించారు. ఇది గరిష్టంగా 55dB వరకు నాయిస్‌ను తగ్గించగలదు. అంతేకాకుండా “Transparency Mode” కూడా ఇందులో ఉండటంతో ఇయర్‌బడ్స్ తొలగించకుండా బయట శబ్దాలను వినవచ్చు. గేమింగ్ కోసం ప్రత్యేక “గేమ్ మోడ్”ను అందించారు. ఇందులో కేవలం 45ms వరకు మాత్రమే లేటెన్సీ ఉండటంతో గేమర్లకు మంచి అనుభవం లభిస్తుంది.

బ్యాటరీ పరంగా చూస్తే.. ప్రతి ఇయర్‌బడ్‌లో 62mAh బ్యాటరీ, ఛార్జింగ్ కేసులో 590mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో 12 గంటల వరకు ప్లేబ్యాక్ లభిస్తుందని, ఛార్జింగ్ కేసుతో కలిపి మొత్తం 50 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. కేవలం 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తోనే 11 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ అవుతుంది. ధూళి, నీటి నిరోధకత కోసం ఈ ఇయర్‌బడ్‌లకు IP55 రేటింగ్ ఇచ్చారు. ఒక్కో ఇయర్‌బడ్ బరువు సుమారు 4.8 గ్రాములు కాగా, ఛార్జింగ్ కేసుతో కలిపి మొత్తం బరువు 53 గ్రాములుగా ఉంది.

భారత్‌లో Realme Buds Air 8 Pro ధర రూ. 6,999గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్ కింద రూ. 300 వరకు డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌బడ్‌లు మాస్టర్ వైట్, మాస్టర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌ లలో లభించనున్నాయి. జూన్ 3 మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదటి సేల్ ప్రారంభం కానుండగా, జూన్ 5 రాత్రి 11:59 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్, రియల్ మీ ఇండియా, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.