Site icon NTV Telugu

Big Breaking: అచ్చుతాపురం సెజ్‌లో మరోసారి భారీ పేలుడు..

Anakapalli Sez

Anakapalli Sez

Big Breaking: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి భారీ పేలుడు సంభవించింది.. ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్లు భారీ శబ్ధంతో పేలినట్టు స్థానికులు చెబుతున్నారు.. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది… ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందినట్టుగా తెలుస్తుండగా.. మరికొంతమంది గాయాలతో బయటపడినట్టు చెబుతున్నారు.. ఇక, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం అందుతుండగా.. భారీ శబ్దాలు రావడంతో ఉద్యోగులు, కార్మికులు, స్థానికులు భయంతో పరుగులు పెట్టారు.. ఓవైపు మంటలు, మరోవైపు పొగలు పరిసర ప్రాంతాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ప్రస్తుతం రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు.. మరికొన్ని ఫైరింజన్లను రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version