Site icon NTV Telugu

IPL 2025 Final: నేను స‌పోర్ట్ చేసిన టీమ్ ఓడిపోతోంది.. నా మద్దతు ఆర్సీబీకే! వీరూది పెద్ద ప్లానింగే

Rcb Vs Pbks Ipl 2025 Final

Rcb Vs Pbks Ipl 2025 Final

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు రాత్రి జరిగే ఫైనల్స్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరంభం (2008) నుంచి ఒక్కసారి కూడా టైటిల్‌ను గెలవని ఈ రెండు టీమ్స్.. తమ 18 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. పంజాబ్, బెంగళూరు జట్లు స‌మ‌వుజ్జీల‌గా ఉండ‌డంతో ఫైన‌ల్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.

ఐపీఎల్ 2025 ఫైనల్స్‌లో ఆర్సీబీ గెలుస్తుందని పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ… ‘ఐపీఎల్ 2025 ఫైనల్స్‌లో ఆర్సీబీ విజ‌యం సాధిస్తుంద‌ని అనుకుంటున్నాను. ఇటీవల నేను మద్దతు ఇచ్చే జట్టు ఓడిపోవడం గమనించా. క్వాలిఫ‌య‌ర్‌-1లో ఆర్సీబీపై పంజాబ్ గెలుస్తుందని అంచ‌నా వేశాను. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది. ఎలిమినేట‌ర్‌లో గుజ‌రాత్ గెలుస్తుంద‌ని చెప్పా కానీ.. ముంబై గెలిచింది. క్వాలిఫ‌య‌ర్‌-2లో ముంబైకి స‌పోర్ట్ చేశా, ఆ మ్యాచులో పంజాబ్ గెలిచింది. భారత జట్టు విషయంలో కూడా ఇదే జ‌రుగుతోంది. నేను గెలుస్తుంద‌ని చెప్పిన ప్ర‌తీసారి టీమిండియా ఓడిపోయింది’ అని సెహ్వాగ్ చెప్పాడు. ఫైనల్స్‌లో ఆర్సీబీకి వీరూ మద్దతు ఇస్తున్నాడు. అంటే పంజాబ్ గెలవాలని కోరుకుంటున్నాడు.

Also Read: Rana Naidu: Season 2: ‘రానా నాయుడు’ సీజన్‌ 2 ట్రైలర్‌ వచ్చేసింది.. ఈసారి మొత్తం..!

మరోవైపు ఫైనల్స్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ ఆర్సీబీ జట్టుకు మద్దతు ఇస్తున్నాడు. ‘ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు ఈసారి ఆర్సీబీ కప్ గెలవాలని మీడియాకు చెప్పాను. టోర్నీ ఆర్సీబీ బాగా రాణించింది. ఈ సారు వారు కప్ గెలుస్తారని ఆశిస్తున్నా. విరాట్ కోహ్లీ, ఆర్సీబీ జట్టుకు నా శుభాకాంక్షలు’ అని దిల్షాన్ చెప్పాడు. దిల్షాన్ 2011 నుంచి 2013 వరకు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో 52 మ్యాచ్‌లలో 1153 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్షెల్ గిబ్స్ కూడా ఆర్సీబీనే కప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. గిబ్స్ 2008 నుంచి 2012 మధ్య 36 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి 886 పరుగులు చేశాడు.

Exit mobile version