RCB IPL 2025 Retained Players List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025కి సంబంధించి మెగా వేలం వచ్చే నవంబర్‌లో ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీంతో అన్ని ప్రాంఛైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌పై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇప్పటికే రిటెన్షన్ లిస్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆర్‌సీబీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అధికారికంగా ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు కానీ.. క్రికెట్ వర్గాల ప్రకారం ముగ్గురు స్టార్ క్రికెటర్లను విడుదల చేసిందట.
ఐపీఎల్ 2025కి సంబంధించి రిటెన్షన్ లిస్ట్ సంఖ్యను బీసీసీఐ ఇంకా ఖరారు చేయలేదు. రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ ఆప్షన్‌తో కలిపి మొత్తంగా ఆరుగురిని ప్రాంచైజీ అట్టిపెట్టుకునే వెసులుబాటు కల్పిస్తుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఐదుగురితో కూడిన రిటెన్షన్ లిస్ట్‌ను ఆర్‌సీబీ సిద్ధం చేసినట్లు సమాచారం. స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్.. భారత ఆటగాళ్లు యశ్ దయాళ్, రజత్ పటీదార్.. ఇంగ్లండ్ హిట్టర్ విల్ జాక్స్‌ను రిటెన్షన్ చేసుకుందట. మరొకరికి అవకాశం ఉంటే ఆకాశ్ దీప్ కొనసాగుతాడు.
అందరూ అనుకున్నట్లుగానే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను ఆర్‌సీబీ అట్టిపెట్టుకోవడం లేదని తెలుస్తోంది. గత ఎడిషన్‌లో పెద్దగా రాణించకపోవడం, వయసు 40 ఏళ్లకు చేరడమే అతడి వేటుకు కారణం. ఫాఫ్ స్థానంలో యువ ఆటగాడిని తీసుకోవాలనుకుంటుందట. వేలంలో కెప్టెన్సీ సత్తా ఉన్న ఆటగాడిని తీసుకోనుందని తెలుస్తోంది. ఈ సీజన్‌లో ఘోరంగా విఫలమైన గ్లెన్ మాక్స్‌వెల్, పెద్దగా ప్రభావం చూపని కామెరూన్ గ్రీన్‌లను పక్కన పెట్టిందట. ఈ ముగ్గురి స్థానాల్లో మంచి ప్లేయర్లను తీసుకోవాలని ఆర్‌సీబీ చూస్తోంది. నవంబర్ రెండో వారంలో మెగా వేలం జరిగే అవకాశం ఉంది. దుబాయ్‌లో వేలం జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఆర్‌సీబీ రిటైన్ లిస్ట్:
విరాట్ కోహ్లీ
మహమ్మద్ సిరాజ్
యశ్ దయాళ్
రజత్ పటీదార్
విల్ జాక్స్
Also Read: రెడ్ డ్రెస్‌లో పీసీ, బ్లాక్ డ్రెస్‌లో సామ్.. వెరీ హాట్ గురూ!
ఆర్‌సీబీ రిలీజ్ లిస్ట్:
ఫాఫ్ డు ప్లెసిస్
అనూజ్ రావత్
దినేష్ కార్తీక్
సుయాష్ ఎస్ ప్రభుదేసాయి
సౌరవ్ చుహాన్
మహిపాల్ లోమ్రోర్
కర్ణ్ శర్మ
కామెరాన్ గ్రీన్
స్వప్నిల్ సింగ్
మయాంక్ దాగర్
మనోజ్ భాండాగే
ఆకాశ్ దీప్
అల్జారీ జోసెఫ్
లాకీ ఫెర్గూసన్
టామ్ కర్రన్
గ్లెన్ మాక్స్‌వెల్
రీస్ టాప్లీ
హిమాన్షు శర్మ
రాజన్ కుమార్
వైశాఖ్ విజయ్ కుమార్