Site icon NTV Telugu

RCB Playoffs: ఈ సాలా కప్ నమ్దే.. ఇదే జరిగితే ఆర్‌సీబీ ప్లేఆఫ్ రేసు నుంచి అవుట్..!

Rcb

Rcb

RCB Playoffs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌ ఆసక్తికరంగా కొనసాగుతోంది. పలు జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 17న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచ్ రద్దు వల్ల రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించగా, KKR ప్లేఆఫ్ అవకాశాలు ముగిసిపోయాయి.

Read Also: Vivo Smartphones: కేవలం రూ.15,000లోపే బెస్ట్ స్టైల్, పనితీరు ఫీచర్లతో అందుబాటులో ఉన్న వివో ఫోన్లు ఇవే..!

ఈ మ్యాచ్ రద్దు కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. ఇది ప్లేఆఫ్‌కు చేరడానికి దాదాపు ఖచ్చితమైన స్థానంలో ఉంది. మరోవైపు, ఇక KKR 13 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో నిలిచింది. ఇక మిగిలిన మ్యాచ్ గెలిచినా, గరిష్టంగా 14 పాయింట్లకే చేరగలదు. ఇది ప్లేఆఫ్‌కు సరిపోదు. RCB ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడి 17 పాయింట్లు సాధించింది. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌లలో ఒకదాన్ని గెలిస్తే, ప్లేఆఫ్‌కు అర్హత ఖాయం అవుతుంది. అయితే, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి కొన్ని పరిస్థితుల్లో RCB ప్లేఆఫ్‌కు చేరకపోవచ్చు. అది ఎలా అంటే..

డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన KKR, ఈ సీజన్‌లో మిశ్రమ ఫలితాలతో పోటీ నుంచి నిష్క్రమించింది. వర్షం కారణంగా RCBతో మ్యాచ్ రద్దు కావడం, వారి ప్లేఆఫ్ ఆశలను పూర్తిగా ముగించింది. ఇది IPL 2025లో ప్లేఆఫ్‌కు అర్హత పొందలేని నాల్గవ జట్టుగా KKRను నిలిచింది. ఇక పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్ చివరికి నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ జట్లు గెలిస్తేనే ఇది సాధ్యమవుతుంది.

Read Also: Tirupati Laddu Case: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో కదులుతున్న డొంక.. పలువురు ఉద్యోగులకు నోటీసులు

ఆ తర్వాత, ఢిల్లీ వారి తర్వాతి మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించి, ముంబై జట్టు తన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే అప్పుడు అంతా RCB నెట్ రన్ రేట్‌పై ఆధారపాడిల్సి వస్తుంది. కానీ, RCB ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే మాత్రం నేడు (ఆదివారం) జరిగే డబుల్ హెడర్‌ లలో పంజాబ్ (vs రాజస్థాన్) లేదా ఢిల్లీ (vs గుజరాత్) తమ మ్యాచ్‌ను ఓడిపోతే సరిపోతుంది. ఆపై బెంగళూరు జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒక మ్యాచ్ గెలిచినా ఆర్‌సీబీ ప్లేఆఫ్‌లో ఉంటుంది.

Exit mobile version