Site icon NTV Telugu

RCB Stampede: మృతుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చిన సీఎం.. రూ.10 లక్షల సహాయం ప్రకటన..

Cm Siddaramaiah

Cm Siddaramaiah

ఆర్సీబీ విజయోత్సవాల్లో విషాద ఘటనపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తొక్కిసలాటపై సీఎం విచారం వ్యక్తం చేశారు. 11 మంది చనిపోయినట్లు సీఎం స్పష్ట చేశారు. మరో 33 మందికి గాయాలైనట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. వైద్యులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని సీఎం చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నట్లు తెలిపారు. ఇంత భారీగా జనం వస్తారని ఊహించలేదన్నారు. స్టేడియం 35 వేల మంది సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు. కానీ 3 లక్షలకు పైగా అభిమానులు బయట ఉన్నారని చెప్పారు.

READ MORE: Hyundai Verna SX+: 5 స్టార్ భద్రతా ప్రమాణాలు, టాప్ క్లాస్ సౌకర్యాలతో హ్యుందాయ్‌ వెర్నా SX+ లాంచ్..!

ఈ ఘటన విని షాక్ అయ్యాం.. ఈ విషాదం బాధ విజయ ఆనందాన్ని తుడిచిపెట్టేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారందరూ ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డారని సీఎం సిద్ధరామయ్యా తెలిపారు. వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని.. ప్రభుత్వం వారికి సాధ్యమైనంత సహాయం అందిస్తుందని వెల్లడించారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం. ఈ సంఘటనపై ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందన్నారు. తొక్కిసలాటపై దర్యాప్తుకు ఆదేశించామని వెల్లడించారు.

READ MORE: PM Modi On Stampede: బెంగళూరులో తొక్కిసలాట.. మృతులకు ప్రధాని మోడీ సంతాపం

Exit mobile version