Site icon NTV Telugu

RCB IPL 2024: పాపం.. ఆర్సీబీ ఈసారైనా కప్ కొడుతుందా.. లేదా..?

Rcb

Rcb

RCB IPL 2024 Squad: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB).. ఇప్పటి వరకు ఐపీఎల్‌ టైటిల్‌ను సాధించలేకపోయింది. ప్రతీ సీజన్‌లోనూ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినప్పటికి.. చివరి నిమిషంలో బొక్కాబోర్లా పడడం బెంగళూరు టీమ్ కి అలవాటుగా మారింది. ఐపీఎల్‌ తొలి సీజన్ నుంచి ఇప్పటి వరకు టైటిల్‌ అందని ద్రాక్ష లాగానే మిగిలిపోయింది. కానీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్‌ మాత్రం రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతీ ఏడాది ‘ఈసాలా కప్ నమ్దే’ అనే డైలాగుతో సందడి చేస్తుంటారు. ఇక, ఈసారైనా ఆర్సీబీ టైటిల్‌ కొడుతుందా అని వెయ్యికళ్లుతో ఎదురుచూస్తున్నారు. ఇక, ఐపీఎల్‌-2024 సీజన్‌ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది.

Read Also: Telangana Schools: తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు

కాగా, ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 2008 ఆరంభ సీజన్‌ నుంచి ఆర్సీబీ ఇప్పటి వరకు మూడు సార్లు ఫైనల్‌కు వెళ్లింది. కానీ మూడు సార్లు కూడా ఓడిపోయింది. 2009లో తొలిసారి ఐపీఎల్‌ లో ఫైనల్‌కు వెళ్లిన బెంగళూరు.. ఫైనల్లో డెక్కన్‌ ఛార్జర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓటమి పాలైంది.. ఆ తర్వాత 2011 సీజన్‌లో చెన్నైసూపర్‌ కింగ్స్‌ చేతిలో ఆర్సీబీ ఓడిపోయి రన్నరప్‌తో సరి పెట్టుకుంది. ఇక, 2016 సీజన్‌లో విరాట్‌ కోహ్లి సారథ్యంలో వరుస విజయాలతో బెంగళూరు టీమ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ, మళ్లీ మరోసారి హైదరాబాద్‌ జట్టు చేతిలోనే పరభావం పాలైంది. ఆ తర్వాత 2017, 2018, 19 సీజన్లలో ఆర్సీబీ దారుణంగా ఫెయిల్ అయింది. ఇక, వరుసగా 2020, 21, 22 సీజన్లలో ప్లే ఆఫ్స్‌ వరకు వెళ్లింది.

Read Also: MS Dhoni: ఎంఎస్ ధోనినీ డీజిల్ ఇంజన్తో పోల్చిన డివిలియర్స్

అయితే, ఐపీఎల్ 2021 తర్వాత విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత తమ కొత్త కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్‌ ఫాఫ్ డుప్లెసిస్‌ను బెంగళూరు ఎంపిక చేసింది. ఇక, డుప్లెసిస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్‌లోనే ఆర్సీబీనిప్లే ఆఫ్స్‌కు తీసుకుపోయాడు. కానీ, టైటిల్‌ను మాత్రం అందించలేకపోయాడు. ఐపీఎల్‌-2022 సీజన్ క్వాలిఫెయర్1లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడిపోగా.. 2023 సీజన్‌లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో ఆరోస్ధానానికే ఫిక్స్ అయింది.

Read Also: Boora Narsaiah Goud: రాజీనామా చేస్తావా? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బూర నర్సయ్య సవాల్

ఇక, ఆర్సీబీ బ్యాటింగ్‌ పరంగా చాలా పటిష్టంగా ఉంది. ప్రస్తుత జట్టులో విరాట్‌ కోహ్లీ, ఫాప్‌ డుప్లెసిస్‌, మాక్స్‌వెల్‌ లాంటి వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్లు ఉన్నారు.. వీరికి ఈ ఏడాది సీజన్‌లో ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్ తోడవ్వడంతో ఆర్సీబీ టీమ్ బ్యాటింగ్‌ విభాగం మరింత బలంగా తయారైంది. అయితే, గత సీజన్‌లో ఓపెనర్లుగా కోహ్లీ, డుప్లెసిస్‌ జట్టుకు అద్బుతమైన ఆరంభాలను అందించారు. ఈ సారి కూడా ఈ స్టార్‌ జోడీ చెలరేగితే ప్రత్యర్ధి జట్లకు కష్టాలు తప్పవు అని క్రికెట్ పండితుతులు అంటున్నారు. ఇక, బౌలింగ్‌ లో కూడా ఆర్సీబీ బలంగా కనబడుతుంది. మహ్మద్ సిరాజ్‌, లూకీ ఫెర్గూసన్‌, జోషఫ్‌, టామ్‌ కుర్రాన్‌ వంటి వారితో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది.

Read Also: Pooja Hegde: బుట్ట బొమ్మ అందాలకి కుర్రకారు ఫిదా….

కాగా, గత సీజన్‌లో దినేశ్ కార్తీక్‌ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. అతడు మినహా సరైన వికెట్‌ కీపర్‌ కూడా ఆర్సీబీలో కనిపించడం లేదు.. ఇక, ఆర్సీబీ స్పిన్‌ విభాగంలో పేలవంగా ఉంది. అంతర్జాతీయ స్ధాయిలో అనుభవం ఉన్న ఒక్క స్పిన్నర్‌ కూడా ఈ టీమ్ లో లేరు.. మ్యాక్సీవెల్ ఉన్నప్పటికీ పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. ఇక, ఐపీఎల్‌-2024లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 22న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడబోతుంది.

Exit mobile version