NTV Telugu Site icon

RCB Team: పూర్తిగా మారిన ఆర్‌సీబీ టీమ్.. హిట్టర్స్ వచ్చిన వేళ కలిసొచ్చేనా?

Rcb Full Squad Ipl 2025

Rcb Full Squad Ipl 2025

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) టీమ్ పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సత్తా ఉన్న ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. హిట్టర్లు లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, టీమ్ డేవిడ్, జితేష్ శర్మలను తీసుకుంది. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌కు తోడుగా టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను కొనుగోలు చేసింది. భారత్ బౌలర్లు కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్‌లను ఆర్‌సీబీ సొంతం చేసుకుంది.

ఐపీఎల్ 2025 వేలానికి ముందు విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, యశ్ దయాల్‌లను ఆర్‌సీబీ అట్టిపెట్టుకుంది. రూ.83 కోట్ల భారీ పర్స్‌తో వేలంలోకి వచ్చిన ఆర్‌సీబీ.. 19 మంది ఆటగాళ్లను తీసుకుంది. లుంగి ఎంగిడి, నువాన్ తుషార, రొమారియో షెఫర్డ్ లాటి విదేశీ ఆటగాళ్లను ఆర్‌సీబీ దక్కించుకుంది. దేవ్‌దత్‌ పడిక్కల్‌, స్వప్నిల్ సింగ్, మోహిత్‌ రాధే, అభినందన్‌ సింగ్‌, సుయాష్ శర్మ లాంటి ఇండియన్ ప్లేయర్స్ జట్టులోకి వచ్చారు. పడిక్కల్‌, సుయాష్ శర్మలు దేశవాళీ టోర్నీలలో సత్తాచాటారు.

అయితే కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చహల్‌, మహమ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ల కోసం ఆర్‌సీబీ కనీసం బిడ్ కూడా వేయలేదు. ఆర్‌టీమ్ కార్డ్ ఉపయోగించుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు. ఆర్‌టీమ్ కార్డ్ ఉపయోగించలేదు. కనీస ధరలకే మాజీ ప్లేయర్స్ అందుబాటులో ఉన్నా.. ఆర్‌సీబీ కొనుగోలు చేయలేదు. టీమ్ మొత్తాన్ని మార్చాలనే ఉద్దేశంతో.. పూర్తిగా కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. కాస్త ఆల్‌రౌండర్‌ల లోటు ఉన్నా.. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆర్‌సీబీ పటిష్టంగానే ఉంది. హిట్టర్స్ జట్టులోకి వచ్చిన వేళ ఆర్‌సీబీకి ఏమైనా కలిసొస్తుందో చూడాలి. బెంగళూరు ఇప్పటివరకు టైటిల్ గెలవని విషయం తెలిసిందే.

వేలంలో ఆర్‌సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా:
1. లియామ్ లివింగ్‌స్టోన్: రూ. 8.75 కోట్లు
2. ఫిల్ సాల్ట్ – రూ. 11.50 కోట్లు
3. జితేష్ శర్మ – రూ. 11 కోట్లు
4. జోష్ హేజిల్‌వుడ్ – రూ. 12.5 కోట్లు
5. రసిఖ్ దార్ – రూ. 6 కోట్లు
6. సుయాష్ శర్మ – రూ. 2.6 కోట్లు
7. కృనాల్ పాండ్యా – రూ. 5.75 కోట్లు
8. భువనేశ్వర్ కుమార్ – రూ. 10.75 కోట్లు
9. స్వప్నిల్ సింగ్ – రూ. 50 లక్షలు
10. టిమ్ డేవిడ్ – రూ. 3 కోట్లు
11. రొమారియో షెపర్డ్ – రూ. 1.5 కోట్లు
12. నువాన్ తుషార – రూ. 1.6 కోట్లు
13. మనోజ్ భాండాగే – రూ. 30 లక్షలు
14. జాకబ్ బెథెల్ – రూ. 2.6 కోట్లు
15. దేవదత్ పడిక్కల్ – రూ. 2 కోట్లు
16. స్వస్తిక్ చికారా – రూ. 30 లక్షలు
17. లుంగి ఎంగిడి – రూ. 1 కోటి
18. అభినందన్ సింగ్ – రూ. 30 లక్షలు
19. మోహిత్ రాథీ – రూ. 30 లక్షలు

Also Read: CSK Team: మరోసారి అనుభవానికే పెద్దపీట.. ధోనీ సెలెక్షన్ సూపర్! సీఎస్‌కే ఫుల్ టీమ్ ఇదే

రిటైన్ లిస్ట్:
1.విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)
2.యశ్ దయాల్ (రూ.5 కోట్లు)
3.రజత్ పటిదార్ (రూ.11 కోట్లు)