Site icon NTV Telugu

IPL 2025: ఆర్సీబీ టార్గెట్ టాప్‌-2.. మరి ఎస్‌ఆర్‌హెచ్‌ ఏం చేస్తుందో!

Rcb Vs Rr

Rcb Vs Rr

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్లేఆఫ్స్‌ బెర్తులు ఖరారు అయ్యాయి. గుజరాత్‌ టైటాన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లాయి. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో ఎనిమిదింట్లో విజయం సాధించిన ఆర్సీబీ.. 17 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో రెండో స్థానంలో ఉంది. లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండడంతో ఆర్సీబీకి టాప్ 2లో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) రూపంలో ఆర్సీబీకి పెను ముప్పు పొంచి ఉంది.

ప్లేఆఫ్స్‌ చేరినా.. లీగ్‌ దశలో టాప్‌-2లో నిలవడంపైనే అన్ని టీమ్స్ దృష్టి సారిస్తాయి. ఎందుకంటే.. తొలి రెండు స్థానాల్లో నిలిస్తే ఓ విజయంతో ఫైనల్‌ చేరొచ్చు. అంతేకాదు ఓడినా ఫైనల్‌ చేరేందుకు.. మరో అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్లేఆఫ్స్‌ చేరిన టీమ్స్ అన్నిటి లక్ష్యం టాప్‌-2లో నిలవడమే. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. టాప్‌-2లో స్థానాన్ని పదిలపరుచుకునే లక్ష్యంతో ఉంది. టాప్‌-2లోనే కొనసాగాలంటే నేడు జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను బెంగళూరు ఓడించాల్సి ఉంటుంది.

Also Read: Suryakumar Yadav: సచిన్ 15 ఏళ్ల రికార్డు.. 2023లో మిస్ అయింది, ఈసారైనా ‘సూరీడు’ సాధిస్తాడా?

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ సొంతగడ్డపై ఆడాల్సి ఉన్నప్పటికీ.. బెంగళూరులో వర్ష సూచన దృష్ట్యా వేదికను లక్నోకు మార్చారు. ఇది బెంగళూరుకు కాస్త డిసడ్వాంటేజ్ అనే చెప్పాలి. అంతేకాదు గత మ్యాచ్‌లో లక్నోను ఓడించి ఆ జట్టు ప్లేఆఫ్స్‌ అవకాశాలకు ఎస్‌ఆర్‌హెచ్‌ గండి కొట్టింది. ఇప్పుడు ఆర్సీబీ టాప్‌-2 ఆశలకు కూడా గండికొట్టే అవకాశాలను కొట్టి పారేయలేం. ప్లేఆఫ్స్‌ అవకాశాలు చేజారాక ఎస్‌ఆర్‌హెచ్‌ స్వేచ్ఛగా ఆడుతోంది. మరి నేడు ఎస్‌ఆర్‌హెచ్‌ ఏం చేస్తుందో చూడాలి. ఆర్సీబీ తన చివరి మ్యాచ్‌లో లక్నోతో తలపడాల్సి ఉంది.

Exit mobile version