RCB-IPL 2026: ఆర్‌సీబీకి బిగ్ షాక్.. సీజన్ మొత్తానికి ఆ స్టార్ పేసర్ దూరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB-IPL 2026: ఐపీఎల్ సీజన్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ నువాన్ తుషారా టోర్నమెంట్ మొత్తానికి దూరమవ్వనున్నాడు. ఇప్పటికే జోష్ హేజిల్‌వుడ్ భాగస్వామ్యంపై అనిశ్చితి నెలకొంది. ఈ తరుణంలో ఫ్రాంచైజీకి మరో చేదు వార్త వచ్చింది. తాజాగా గాయపడిన ఆటగాళ్ల జాబితాలో తుషారా చేరడంతో మరో దెబ్బ తగిలింది. గత సీజన్‌లో ఈ శ్రీలంక పేసర్‌ను ఆర్‌సీబీ 1.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. లీగ్ రెండవ దశ నాటికి హేజిల్‌వుడ్ కోలుకుంటాడని భావిస్తుండగా, తుషారాకు శ్రీలంక క్రికెట్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించకపోవడంతో అతను ప్రస్తుతానికి జట్టుకు దూరమయ్యాడు. ఇక ఇద్దరు కీలక ఫాస్ట్ బౌలర్లు లేకుండానే ఆర్‌సీబీ బరిలోకి దిగనుంది.
READ MORE: Sri Rama Navami 2026: శ్రీరాముడి పూజా విధానం, శుభ ముహూర్తం, హారతి విధానం
Also Read
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
శ్రీలంక మీడియా సంస్థ న్యూస్‌వైర్ నివేదిక ప్రకారం.. తుషారకు ప్రస్తుతం ఎలాంటి గాయం లేనప్పటికీ.. శ్రీలంక క్రికెట్ అతనికి ఎన్ఓసి (NOC) ఇవ్వడానికి నిరాకరించింది. అతని ఫిట్‌నెస్ (Physical Performance Test) ఆశించిన స్థాయిలో లేదని బోర్డు భావిస్తోంది. బోర్డు నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన దుష్మంత చమీర, పాతుమ్ నిస్సంక వంటి ఆటగాళ్లకు మాత్రమే క్లియరెన్స్ ఇచ్చారు. తుషార మాత్రమే కాదు, జట్టులోని మరో ప్రధాన బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ సైతం ఐపీఎల్ మొదటి దశకు దూరం కానున్నాడు. దీంతో ఆర్సీబీ బౌలింగ్‌పై ఆందోళన మొదలైంది. మరోవైపు.. యశ్ దయాల్ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. బౌలింగ్ విభాగంలో కీలక ఆటగాళ్లు లేకపోయినా, రాజత్ పాటిదార్ సారధ్యంలోని ఆర్‌సీబీ.. రాసిఖ్ దార్, అభినందన్ సింగ్ వంటి దేశీ ఆటగాళ్లతో తమ టైటిల్ వేటను మొదలుపెట్టనుంది.
తాజావార్తలు
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
-
RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!