NTV Telugu Site icon

RC 16: రామ్ చరణ్,బుచ్చిబాబు చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది..

Rc16

Rc16

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఎన్నో రోజులు అయ్యింది.. త్వరలోనే సినిమా విడుదల కాబోతుంది.. ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. తాజాగా ఈ సినిమాకు సంబందించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది..

చిత్ర నిర్మాత సంస్ధ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌ ఇచ్చారు. రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌కు కెమెరా మెన్‌ను ఫిక్స్‌ చేశారు మేకర్స్‌. సౌత్‌ ఇండియాలో క్రేజీ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న రత్నవేలును ఎంపిక చేశారు.. ఈరోజు రత్నవేలును పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ మైత్రీ సంస్థ ప్రకటించింది. రత్నవేలు ఇప్పటి వరకు రంగస్థలం,సైరా నరసింహా రెడ్డి,భారతీయుడు 2,ఖైదీ నం. 150, 1: నేనొక్కడినే వంటి చిత్రాలతో పాటు దేవర ప్రాజెక్ట్‌లో ఆయన భాగమయ్యారు..

ఈ సినిమాలో కోస్తా ఆంధ్రా యువకుడిగా కనిపించబోతున్నారని టాక్. ఇక ఆయన పక్కన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుందని తెలుస్తుంది… కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇతర నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట. ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు…