RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కౌంటర్పార్టీ క్రెడిట్ రిస్క్ (CCR)కు సంబంధించిన ప్రమాణీకృత విధానం (SA-CCR) నిబంధనల్లో కీలక మార్పులను ప్రతిపాదించింది. ఈ మేరకు ముసాయిదా సవరణలపై ప్రజలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు ఇతర భాగస్వాముల నుంచి అభిప్రాయాలు, సూచనలు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కౌంటర్పార్టీ క్రెడిట్ రిస్క్ అనేది డెరివేటివ్ లావాదేవీలు లేదా ఇతర ఆర్థిక ఒప్పందాల్లో ఒక పక్షం తన బాధ్యతలను నిర్వర్తించలేకపోతే ఎదురయ్యే నష్టాన్ని సూచిస్తుంది. ఈ ప్రమాదాన్ని అంచనా వేయడానికి మరియు నియంత్రించడానికి ఆర్బీఐ SA-CCR విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
ప్రతిపాదిత సవరణల్లో భాగంగా బ్యాంకింగ్ బుక్, ట్రేడింగ్ బుక్‌లలో ఉన్న కౌంటర్పార్టీ క్రెడిట్ రిస్క్ పరిధిని మరింత స్పష్టంగా నిర్వచించాలని ఆర్బీఐ సూచించింది. అలాగే, బహుళ మార్జిన్ ఒప్పందాలు (Multiple Margin Agreements), బహుళ నెట్టింగ్ సెట్లు (Multiple Netting Sets) వంటి అంశాలపై తాజా చట్టపరమైన, నియంత్రణ మార్పులను దృష్టిలో ఉంచుకుని వివరణాత్మక మార్గదర్శకాలు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇక, సెబీ గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ఈక్విటీ డెరివేటివ్స్, కమోడిటీ డెరివేటివ్స్ విభాగాల్లో క్లియరింగ్ మెంబర్‌గా వ్యవహరించే బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలపై కూడా స్పష్టమైన మార్గనిర్దేశం ఇవ్వాలని ఆర్బీఐ భావిస్తోంది.
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
అదేవిధంగా, ఆప్షన్ ప్రీమియం చెల్లింపుల వాయిదా (Deferment of Option Premium) అంశానికి ప్రత్యేక విధానం, ఆప్షన్ల కోసం ఎఫెక్టివ్ నోషనల్ (Effective Notional) లెక్కింపు విధానం, అలాగే SA-CCR కింద అవసరమైన డిస్క్లోజర్ టెంప్లేట్లను కూడా చేర్చాలని ప్రతిపాదించింది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం, 2016లోనే డెరివేటివ్ లావాదేవీల వల్ల ఏర్పడే కౌంటర్పార్టీ క్రెడిట్ రిస్క్ ఎక్స్పోజర్ లెక్కింపు కోసం మార్గదర్శకాలు మరియు సెంట్రల్ కౌంటర్పార్టీలకు బ్యాంకుల ఎక్స్పోజర్లపై మూలధన అవసరాలకు సంబంధించిన నిబంధనలు విడుదల చేసింది. వీటిని 2018 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ, అనంతరం అమలు వాయిదా పడింది. ప్రస్తుతం మారుతున్న ఆర్థిక పరిస్థితులు, డెరివేటివ్ మార్కెట్ల విస్తరణ, రిస్క్ మేనేజ్మెంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులను ప్రతిపాదించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించిన తర్వాత తుది మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!