NTV Telugu Site icon

INDvsAUS 1st Test: జడేజా డబుల్ బొనాంజా.. కష్టాల్లో ఆసీస్

1

1

బోర్డర్-గవస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు మొదటి రోజు ఆట రసవత్తరంగా సాగుతోంది. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుండటంతో పరుగులు సాధించేందుకు ఆసీస్ బ్యాటర్లు కష్టపడుతున్నారు. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న కంగారూ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత పేస్‌ బౌలర్ల దెబ్బకు ఓపెనర్లు ఖవాజా (1), డేవిడ్ వార్నర్ (1) త్వరగా పెవిలియన్‌కు చేరారు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మార్నస్ లబుషేన్ ( 49), స్టీవ్‌ స్మిత్ (25*) నిలకడగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 82 రన్స్ జోడించాక హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో లబుషేన్‌ను జడేజా పెవిలియన్ పంపాడు. దీంతో 84 రన్స్ వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. ఇక ఇదే ఓవర్లో ఆఖరి బంతికి మ్యాట్ రెన్‌షా (0)ను కూడా ఔట్ చేసిన జడ్డూ.. టీమిండియా క్యాంప్‌లో ఆనందాన్ని నింపాడు. అయితే ఆట లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఆసీస్‌ 32 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేయగా.. రెండో సెషన్ ఆదిలోనే రెండు వికెట్లు దక్కడంతో టీమిండియా క్యాంప్‌లో కాస్త సంతోషం నెలకొంది.

Also Read: Maharashtra ATS: 2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్‌ స్టేట్‌గా మార్చాలనుకుంటోంది..

జోరు పెంచుతూ..

ఆసీస్‌ బ్యాటర్లు మొదట నెమ్మదిగా ఆడినా లబుషేన్ కుదురుకున్నాక దూకుడు పెంచాడు. ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన ఆస్ట్రేలియాను స్టీవ్ స్మిత్, లబుషేన్ ఆదుకొనే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అర్ధశతకం (82) భాగస్వామ్యం నిర్మించారు. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఆసీస్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ఏమాత్రం రిస్క్‌ తీసుకోకుండా క్రీజ్‌లో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అడపాదడపా లబుషేన్ కాస్త బ్యాట్‌కు పని చెప్పినప్పటికీ.. స్టీవ్‌ స్మిత్ మాత్రం డిఫెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు.