NTV Telugu Site icon

Ravindra Jadeja: జడేజా రాసుకుంది ఆయింట్‌మెంట్..రిఫరీకి చెప్పిన టీమిండియా!

Sd1

Sd1

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజే ఓ వివాదం ఊపేసింది. మ్యాచ్ ప్రారంభం కానంత వరకూ పిచ్‌పై నడిచిన వివాదం.. తర్వాత దానిపైకి మళ్లింది. ఇలాంటి అవకాశం కోసమే చూసే ఆస్ట్రేలియా మీడియా దీనిపై పెద్ద రాద్దాంతమే చేస్తోంది. తొలి రోజు ఆటలో పేసర్ సిరాజ్ చేతి నుంచి జడేజా ఏదో తీసుకొని తన వేలికి రాసుకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో టీమిండియా మేనేజ్‌మెంట్ వెంటనే రంగంలోకి దిగి ఈ విషయం మరీ ముదరకుండా చేసే ప్రయత్నం చేస్తోంది. మేనేజ్‌మెంటే తనకు తానుగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ దగ్గరికి వెళ్లి జడేజా తన వేలికి రాసుకున్నది ఓ ఆయింట్‌మెంట్ అని చెప్పిందట. ఇది కేవలం నొప్పిని నివారించడానికే అని వివరణ ఇచ్చిందని తెలుస్తోంది.

Also Read: INDvsAUS 1st Test: రోహిత్ సూపర్ సెంచరీ..లీడ్‌లోకి టీమిండియా

నిజానికి ఈ ఘటనపై ఆస్ట్రేలియా టీమ్ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయితే పరిస్థితులను బట్టి ఇలాంటి ఘటనలపై రిఫరీ ఎవరి ఫిర్యాదు లేకపోయినా స్వతంత్రంగా విచారణ జరిపే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు బాల్ షేప్ మారకుండా ఉంచడానికి నిబంధనల ప్రకారం.. ఎవరైన తమ చేతులకు ఏదైనా రాసుకోవాలని అనుకున్నప్పుడు ముందుగా అంపైర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా వివాదాన్ని పెద్దది చేసే అవకాశం ఉందని ముందుగానే గుర్తించిన టీమ్ మేనేజ్‌మెంట్ రిఫరీని కలిసి జరిగిన విషయాన్ని చెప్పింది. సుమారు ఐదు నెలల తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జడేజా 5 వికెట్లతో ఆస్ట్రేలియాను దెబ్బ తీశాడు.

Also Read: Priyanka Jawalkar: అనంతపురం పిల్ల ఎంత చూపించినా.. సెట్ అవ్వడం లేదే