Civil Supply Corporation: సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్‌గా రవీందర్ సింగ్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. తనకు ఇంతటి కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఋణపడి ఉంటానని రవీందర్ సింగ్ అన్నారు. మంత్రి గంగులతో కలిసి పనిచేసి సివిల్ సప్లై కార్పొరేషన్ మంచి పేరు తెస్తానన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 1600 రైస్ మిల్లులు ఉంటే ఇవాళ 2600 పైగా రాష్ట్రంలో రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. వరి ధాన్యం కోటి టన్నులు పండుతుంది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. పంజాబ్ రాష్ట్రం కంటే కూడా అధికంగా తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం పండుతుందన్నారు. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం ఒక్క ఉద్యమంగా చేస్తున్నారు అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైస్ మిల్లులో 100 మొక్కలు నాటాలన్నారు.
రాష్ట్రంలో రైతులు రికార్డ్ స్థాయిలో వరి పంటను పండిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పండిన పంటను మొత్తం కూడా ప్రభుత్వమే కొంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ పండిన పంటను కొనుగోలు చేయాలని చెప్పారని తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతోనే పెద్ద ఎత్తున పంటను పండిస్తున్నారన్నారు. రవీందర్ సింగ్ ఉద్యమంలో పోరాడారని.. ఆయన ప్రజల కోసం పని చేసే వ్యక్తి అని సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.. కరీంనగర్‌లో మేయర్‌గా పని చేసిన అనుభవం ఉందన్నారు. కరీంనగర్‌లో సేవలు అందించిన వ్యక్తికి రాష్ట్ర స్థాయిలో పేద ప్రజలకు సేవ చేసే అవకాశం ముఖ్యమంత్రి కల్పించారన్నారు.
Minister Harish Rao: మావి న్యూట్రిషన్ పాలిటిక్స్.. వారివి పార్టిషన్ పాలిటిక్స్
సివిల్ సప్లై శాఖ మంత్రి, కార్పొరేషన్ ఛైర్మన్ ఇద్దరు కరీంనగర్‌కు చెందిన వారేనని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. పేద ప్రజలకు సేవ చేసే అవకాశం ఈ శాఖ ద్వారా దక్కుతుందన్నారు. గతంలో సివిల్ సప్లై కార్పొరేషన్‌ను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేసిన తర్వాత రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటను పండిస్తున్నారన్నారు. కోటి టన్నుల వరి ధాన్యం పండిస్తున్నారు అంతే స్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు.
