Site icon NTV Telugu

R Ashwin Daughter : తండ్రి అవుటవ్వగానే బోరున ఏడ్చేసిన కూతురు

R Ashwin Daughter

R Ashwin Daughter

R Ashwin Daughter : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023)లో భాగంగా ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) తలపడింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఈ పోరు ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (1), జాస్ బట్లర్ (0) వెంట వెంటనే అవుటయ్యారు. ఆరంభంలో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్తాన్ పరుగులు చేయలేకపోయింది.

Read Also: Manchu Manoj: మనోజ్-మౌనికల పెళ్లి పాటలో మంచు విష్ణు…

ఈ క్రమంలోనే క్రీజులోకి వచ్చిన అశ్విన్ తాను ఎదుర్కొన్న రెండు బంతులను ఫోర్, సిక్సర్ గా మలిచాడు. ఫలితంగా, అశ్విన్ కుమార్తె ఆధ్య తన తండ్రి బ్యాటింగ్‌ను చూసి ఆనందంతో చప్పట్లు కొట్టింది. తర్వాత బంతిలోనూ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అశ్విన్.. రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అంతే అశ్విన్ బయటకు వచ్చి ఏడవడం మొదలుపెట్టాడు. తండ్రి బయటకు వెళ్లి ఏడవడం ఆ చిన్నారి తట్టుకోలేకపోయింది. తల్లి ప్రీతి ఎంత చెప్పినా వినలేదు. ప్రస్తుతం అశ్విన్ కూతురు ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మా నాన్నకు ఆ చిన్నారి అంటే ఎంత ఇష్టమో’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Exit mobile version