NTV Telugu Site icon

Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి షో రీల్ అప్డేట్ వైరల్..

Mr Bachchan

Mr Bachchan

Mr Bachchan : మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులని అంతగా మెప్పించలేదు.ఈ సినిమా తరువాత రవితేజ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.హరీష్ శంకర్ ,రవితేజ కాంబినేషన్ లో గతంలో షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు వచ్చాయి.ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.దీనితో ‘మిస్టర్ బచ్చన్ ‘మూవీపై అంచనాలు భారీగా వున్నాయి.

Read Also :Pushpa 2 : పోస్ట్ పోన్ కి కారణం అదేనా..?

ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగా రవితేజ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్ లో కనిపించి ఎంతగానో అలరించాడు.ఈ సినిమాలో రవితేజ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ గా నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే రీసెంట్ గా దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమా నుంచి షో రీల్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు .తాజాగా ఈ షో రీల్ విడుదల చేసే తేదీతో పాటు టైం ను కూడా ప్రకటించారు.ఈ షో రీల్ ను జూన్ 17 సాయంత్రం 4.06 గంటలకు విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసారు.