Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!

Vivek Athreya Movie

Vivek Athreya Movie

ఒక పక్క బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ సినిమాతో రికార్డుల మోత మోగిస్తున్న మాస్ మహారాజా రవితేజ, మరోపక్క ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఈమధ్యనే ఆయన ఒక సినిమా అనౌన్స్ చేయగా, ఇప్పుడు సక్సెస్ జోష్‌లో ఉన్న రవితేజ.. ‘సరిపోదా శనివారం’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేతులు కలిపారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీని సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇటీవలే ‘ఇరుముడి’ చారిత్రక విజయం సాధించిన నేపథ్యంలో, దర్శకుడు వివేక్ ఆత్రేయ, నిర్మాతలు లక్ష్మణ్, శ్రీని ప్రత్యేకంగా రవితేజను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే క్రమంలో ఈ సరికొత్త కలయికకు సంబంధించిన ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. తనదైన మార్క్ విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో కథలను నడిపించే వివేక్ ఆత్రేయ స్టైల్‌కి, రవితేజ ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, మాస్ ఇమేజ్ తోడైతే వెండితెరపై ఆ అనుభూతి కచ్చితంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ, యువ దర్శకుడు హసిత్ గోలితో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. టాలీవుడ్‌లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్‌గా మారిన ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.