Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక పక్క బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ సినిమాతో రికార్డుల మోత మోగిస్తున్న మాస్ మహారాజా రవితేజ, మరోపక్క ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. ఈమధ్యనే ఆయన ఒక సినిమా అనౌన్స్ చేయగా, ఇప్పుడు సక్సెస్ జోష్‌లో ఉన్న రవితేజ.. ‘సరిపోదా శనివారం’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేతులు కలిపారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీని సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇటీవలే ‘ఇరుముడి’ చారిత్రక విజయం సాధించిన నేపథ్యంలో, దర్శకుడు వివేక్ ఆత్రేయ, నిర్మాతలు లక్ష్మణ్, శ్రీని ప్రత్యేకంగా రవితేజను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే క్రమంలో ఈ సరికొత్త కలయికకు సంబంధించిన ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. తనదైన మార్క్ విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో కథలను నడిపించే వివేక్ ఆత్రేయ స్టైల్‌కి, రవితేజ ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, మాస్ ఇమేజ్ తోడైతే వెండితెరపై ఆ అనుభూతి కచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ, యువ దర్శకుడు హసిత్ గోలితో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. టాలీవుడ్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్‌గా మారిన ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.
Also Read
- Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- Tags
తాజావార్తలు
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!