మేకర్స్ ఎలాంటి అప్ డేట్ లు ఇవ్వకపోయినా, విలన్.. హీరో.. హీరోయిన్ నటీనటుల విషయంలో రకరకాల వార్తలు పుట్టించడం కొత్తేమి కాదు. కానీ అని వార్తలపై రియాక్ట్ అవ్వలని లేదు. అయితే తాజాగా మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ తిరుగుతున్నాయి. ఆయన కొత్త సినిమాలో మొత్తం ఆరుగురు హీరోయిన్లు నటించబోతున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఈ ప్రచారం పై స్పష్టత నిస్తూ రవితేజ టీమ్ అధికారికంగా స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలు పూర్తిగా అబద్ధమని, సినిమాలో ఆరు హీరోయిన్‌ల సంగతి పూర్తిగా పుకారేనని వెల్లడించింది. ఎలాంటి నిజం లేని ఇలాంటి వార్తలు నమ్మకూడదని..ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ వర్క్, కాస్టింగ్ పనులు సజావుగా సాగుతున్నాయని, త్వరలోనే మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ ఏమున్న అధికారికంగా మేము వెల్లడిస్తామని కూడా టీమ్ చెప్పింది. దీంతో రూమర్స్‌కు పూర్తిగా పుల్ స్టాప్ పెట్టినట్టే అయ్యింది.
Ravi Teja: మాస్ మహారాజా మూవీ 6 హీరోయిన్లు ..క్లారిటీ ఇచ్చిన టీమ్

Shah Rukh Khan Injury