NTV Telugu Site icon

Raviteja 75 : అటవీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వస్తున్న రవితేజ..?

Raviteja 75 (1)

Raviteja 75 (1)

Raviteja 75 : మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ”మిస్టర్ బచ్చన్”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.దీనితో “మిస్టర్ బచ్చన్ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి,ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ వరప్రసాద్ నిర్మిస్తున్నారు.వివేక్ కూచిబోట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా రైడ్ కు రీమేక్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో రవితేజ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ గా నటించాడు.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.

Read Also :Prabhas : స్పిరిట్ మూవీలో విలన్ గా ఆ బాలీవుడ్ స్టార్ హీరో..?

ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత రవితేజ సామజవరగమన సినిమాతో మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకున్న భాను బొగ్గవరపు దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.రీసెంట్ గా ఆ సినిమా అధికారికంగా ప్రారంభం అయింది.ఈ సినిమా రవితేజ 75 వ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.ధమాకా సినిమాతో హిట్ పెయిర్ గా నిలిచిన వీరి కాంబోలో మరో సినిమా వస్తుండటంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా బిగ్గెస్ట్ పీరియాడిక్ స్టోరీతో అరకు అటవీ బ్యాక్ డ్రాప్ లో సాగనుందని సమాచారం.ఈ చిత్రాన్ని సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ తెరకెక్కిస్తున్నారు.

Show comments