మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉండగా.. ఆయన నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (BMW) వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఫ్యామిలీ సినిమాలను ఎంతో హుందాగా తెరకెక్కించే దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఇటీవల విడుదలైన టీజర్ చూస్తుంటే, రవితేజ మళ్ళీ తన పాత కామెడీ మార్కును గుర్తుచేస్తూ ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. హీరోయిన్స్.. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది. కేవలం వినోదం మాత్రమే కాకుండా, ఈ చిత్రంలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది.ఈ సినిమా గురించిన మరో కీలక వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది..
Also Read : Akhanda 2 OTT : నాలుగు వారాల రూల్ ఫిక్స్.. ఓటీటీలో ‘అఖండ 2’ సందడి!
అయితే మనకు తెలిసి సాధారణంగా సంక్రాంతికి పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, రవితేజ మాత్రం సామాన్య ప్రేక్షకుడికి సినిమాను చేరువ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నిర్మాత సుధాకర్ చెరుకూరి ఒక ప్రకటన చేస్తూ, ఈ చిత్రానికి ఎటువంటి రేట్ల పెంపు ఉండదని, పాత సాధారణ ధరలకే టికెట్లు లభిస్తాయని స్పష్టం చేశారు. పండగ పూట కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఇది నిజంగా పెద్ద ఊరట అని చెప్పవచ్చు.
భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్కోగా.. ఈ చిత్రంలో సునీల్, వెన్నెల కిషోర్, సత్య వంటి స్టార్ కమెడియన్లు ఉండటంతో వినోదానికి లోటు ఉండదని అర్థమవుతోంది. మరి సంక్రాంతి బరిలో ఇతర భారీ చిత్రాల పోటీని తట్టుకుని, తన ‘నార్మల్ రేట్ల’ ఫార్ములాతో రవితేజ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
