NTV Telugu Site icon

Rashmika Mandanna : ఆ స్టార్ హీరో సినిమాలో రష్మిక స్పెషల్ సాంగ్?

Rashmi55

Rashmi55

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ అయ్యింది.. ప్రస్తుతం వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇక బాలీవుడ్ లో కూడా పాగా వేసిన ఈ అమ్మడు అక్కడ కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది..

అదేంటంటే… రష్మిక మందన్న స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ లో రష్మిక కనిపించనున్నట్లు తెలుస్తోంది.. దీనికి సంబందించిన అధికారక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం..

ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ ఏడాది ఏకంగా ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. పుష్ప 2 సినిమా ఆగస్టు 15 న విడుదల కాబోతుంది.. మొత్తంగా చూస్తే అమ్మడు అస్సలు ఖాళీ లేకుండా చేతినిండా సినిమాలను పెట్టుకుంది.. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ కూడా..

Show comments