Site icon NTV Telugu

Rashmika: స్త్రీలు బలహీనులు కాదు.. వారు ఏకమైతే ఆ శక్తిని ఎవరూ ఆపలేరు: రష్మిక

Rashmika Mandana

Rashmika Mandana

ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో దూసుకెళ్తున్న హీరోయిన్ రష్మిక మందన్నా, భాష ఏదైనా పట్టించుకోకుండా వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. అదే వేగంతో విజయాలు కూడా అందిపుచ్చుకుంటూ స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. తాజాగా విడుదలైన ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక, సినిమాలకే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండి అభిమానులతో కంటిన్యూ టచ్‌లో ఉంటుంది.

Also Read : Rashi Khanna : హీరో ఆధిపత్యంపై రాశీ ఖన్నా సెన్సేషనల్ కామెంట్స్

ఇటీవల ఆమె స్త్రీశక్తి గురించి ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. అమ్మాయిలంతా ఏకమై నిలిస్తే ఆ శక్తిని ఎవరూ ఆపలేరని ఆమె స్పష్టంగా తెలిపింది. మహిళల మధ్య ఉండే భావోద్వేగ అనుబంధం వేరే స్థాయిలో ఉంటుందని, మంచి స్నేహితురాలితో దగ్గరైతే జరగబోయే విషయాలు ముందే అర్థమైపోతాయనే ఫీలింగ్ కలుగుతుందని చెప్పింది. స్త్రీలు ఒకరికొకరు మద్దతు ఇస్తే జీవితం మరింత సులభమవుతుందని, వారు బలహీనులు కాదు, ఎంతో ప్రేమతో, బలంతో ఉండే వ్యక్తులని రష్మిక పేర్కొంది. ఎల్లప్పుడూ తనతో ఉండే స్నేహితురాళ్లకు కృతజ్ఞతలు చెబుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి మంచి ఫ్రెండ్స్ ఉండాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పింది.

Exit mobile version