Pushpa 2 : పుష్ప 2తో జాతీయ అవార్డు ఖాయమంటున్న రష్మిక
- డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్
- నేషనల్ అవార్డు పై రష్మిక ఆశలు
- రూ.2వేల కోట్ల వసూళ్లు టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ప్రస్తుతం నేషనల్ లెవల్లోని సినీ ప్రేమికుల అందరి దృష్టి పుష్ప 2 సినిమా మీదే ఉంది. ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు మీద అందరి దృష్టి నెలకొంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎవరు ఊహించని విధంగా బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన సంగతి తెలిసిందే. ‘యానిమల్’సినిమా తర్వాత మరో బిగ్ హిట్‌కి రెడీ అయిపోయింది. పుష్ప 2 తో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో రష్మిక సందడి చేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సోషల్ మీడియాలో పుష్ప 2 సినిమా క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెట్టింట ఈ సినిమా రికార్డుల మోత మ్రోగించడం ఖాయమని అంటున్నారు. పుష్ప 2 సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇండియా మొత్తం బన్నీతో రష్మిక చక్కర్లు కొడుతోంది. బీహార్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ లో పాల్గొన్న రష్మిక తాజాగా గోవాలో ప్రత్యక్ష్యం అయింది.
Read Also: Vikatakavi: వెబ్ సిరీస్‌కు వర్క్ చేయటం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ : జోశ్యుల గాయత్రి
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో రష్మిక పాల్గొంది. తాను పుష్ప 2 సినిమా ప్రమోషన్ కోసం వచ్చానని.. పుష్ప 2 సినిమాను దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూసి ఆదరిస్తారనే నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా సినిమా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేయడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందంటూ రష్మిక పుష్ప 2 పై అంచనాలు పెంచే విధంగా కామెంట్స్ చేసింది. సినిమాలో అల్లు అర్జున్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారని పేర్కొంది.
Read Also: Minister Sridhar Babu: మూసీ ప్రక్షాళనకు ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ణానం
విలేకర్లతో మాట్లాడిన సమయంలో అల్లు అర్జున్‌కి పుష్ప 1 తో నేషనల్ అవార్డు వచ్చింది. పుష్ప 2 సినిమాలో మీ నటనకు గాను జాతీయ అవార్డు వస్తుందని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు వస్తుందని అనుకుంటున్నాను అంటూ ఓ చిన్న స్మైల్ ఇచ్చింది. దాంతో అక్కడ ఉన్న వారు సైతం నవ్వేశారు. పుష్ప 2 సినిమాలో రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ కాస్త ఎక్కువగా ఉంటుందన్న టాక్ వినిపిస్తుంది. అయితే జాతీయ అవార్డు దక్కే స్థాయిలో ఆమె స్క్రీన్ ప్రజెన్స్ ఉండక పోవచ్చు అనే అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ క్రష్ భవిష్యత్తులో అయినా జాతీయ అవార్డును సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. పుష్ప 2 సినిమా ఇప్పటికే రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. బాహుబలి 2 రికార్డ్‌ను బద్దలు కొట్టే విధంగా పుష్ప 2 ఉంటుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!