స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ కన్నడ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది.ఈమె తన మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది.ఆ తరువాత తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అద్భుత విజయం సాధించింది.అలా ఈ భామ వరుస స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం రష్మిక వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా ఉంది. అలాగే రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ భామ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానలతో షేర్ చేసుకుంటుంది.. కొన్నిసార్లు రష్మిక సోషల్ మీడియాలో చేసే పోస్టులు వల్ల ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.అయితే తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా రష్మిక చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ తన సినీ కెరీర్ గురించి పలు విషయాలు తెలియజేసింది.మనం హార్డ్ వర్క్ చేస్తే ఏ రంగంలో అయినా కూడా మంచి విజయం లభిస్తుంది.తాను కూడా మొదట్లో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టానని రష్మిక ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన తాను ఆ తరువాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చానని తెలిపింది.అయితే సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలంటే టాలెంట్ తో పాటు కొంచెం అదృష్టం కూడా కావాలని ఆమె తెలిపింది .అయితే తాను ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాన్ని వదులుకున్నందుకు ఇప్పటికి కూడా బాధపడుతున్నానని ఈ సందర్భంగా రష్మిక తెలియజేశారు. తనకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాలో నటించే అవకాశం వచ్చిందని అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన మాస్టర్ సినిమాలో కూడా నటించే అవకాశం వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలను నేను వదులుకున్నాను.ఆ విషయంలో ఇప్పటికీ నేను ఫీల్ అవుతున్నాను అని రష్మిక చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.