NTV Telugu Site icon

Rashmika Mandanna : మొదటిసారి ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ లో నటించబోతున్న రష్మిక…?

Whatsapp Image 2023 10 03 At 11.03.10 Pm

Whatsapp Image 2023 10 03 At 11.03.10 Pm

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో మూవీ తో రష్మిక హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో అదరగొట్టింది. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. పుష్ప సినిమాతో ఈ భామ పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో బిజీ గా వుంది. ఆమె చేతిలో భారీ చిత్రాలే ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ అమ్మడు బాగానే రానిస్తుంది.. కెరీర్‌లో ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్ చిత్రాలలో భాగమైన ఈ భామ తొలిసారి ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమాను రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ మరియు జీఏ2 సంస్థలు నిర్మించనున్నాయని తెలుస్తుంది.చిలసౌ, మన్మథుడు-2 తర్వాత రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాతో మరోసారి దర్శకుడిగా మారనునున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ కూడా పూర్తయ్యాయని, కథలోని ఎంతో కొత్తదనం ఉండటంతో రష్మిక మందన్న వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పిందని సమాచారం.. ఓ వైపు భారీ కమర్షియల్‌ సినిమాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు కెరీర్‌ పరంగా ప్రయోగాలకు సిద్ధమవుతున్నది హీరోయిన్ రష్మిక మందన్న. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తుంది.. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో పుష్ప-2 మరియు రెయిన్‌బో చిత్రాలతో బిజీ గా వుంది. అలాగే విజయ్‌ దేవరకొండ, గౌతమ్ తిన్నూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Show comments