Prashanth Neel : సలార్ సినిమాకు పూజ చేయించిన ప్రశాంత్ నీల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రశాంత్ నీల్..కేజీఎఫ్’సినిమా తో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజిఎఫ్ రెండు పార్ట్స్ సంచలన విజయం సాధించాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబట్టాయి. కేజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైనా గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం ఈ దర్శకుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’. ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు.రీసెంట్ గా మొదటి పార్ట్ కు సంబంధించి టీజర్ గ్లింప్స్ ని రిలీజ్ చేయగా ఆ గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీనితో సినిమా పై భారీగా అంచనాలు పెరిగాయి.ఇదిలా ఉంటే నేడు కృష్ణాష్టమి సందర్భంగా ప్రశాంత్ నీల్ తన కుటుంబంతో కలిసి సత్యసాయి జిల్లాలోని సొంత ఊరు నీలకంఠపురం వెళ్లారు. అక్కడ తన తండ్రి సమాధికి ఆయన నివాళులర్పించారు. ఆ తరువాత ఆ గ్రామంలోని గుడిలో పూజ ను కూడా చేయించారు. అయితే అందులో తన కుటుంబసభ్యుల పేర్లు చెప్పిన ప్రశాంత్ నీల్.. వాటితో పాటు ‘సలార్’ పేరు కూడా చెప్పారు. సినిమా విజయం సాధించాలని ఆయన దేవున్ని మొక్కుకున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
సాధారణంగా ప్రశాంత్ నీల్ తన సినిమాల విడుదలకు ముందు ఇలా పూజ చేయిస్తారని సమాచారం. గతంలో ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్2’ సినిమా రిలీజ్‌లకు ముందు కూడా ఇలానే పూజ చేయించారని సమాచారం.సలార్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ విడుదల కోసమే ప్రశాంత్ నీల్ పూజ చేయించారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే రీసెంట్ గా ‘సలార్ విడుదల వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలను నవంబర్‌కు వాయిదా వేశారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు. అయితే విదేశాల్లో ఈ సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించగా.. అవి భారీ స్థాయిలో సేల్ అవుతున్నాయి. అయితే సలార్ రిలీజ్ విషయంలో మేకర్స్ స్పందిస్తే తప్ప ఈ రూమర్స్ ఆగవు..ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. మరి ఈ సినిమా విడుదల విషయం గురించి మేకర్స్ ఇకనైనా స్పందిస్తారో లేదో చూడాలి.
Also Read
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Tags
- Pooja
- Prashanth Neel
- salaar
తాజావార్తలు
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!