Site icon NTV Telugu

Rare Surgery at Ruia Hospital: తిరుపతి రుయాలో మూడేళ్ల బాలుడికి అరుదైన శస్త్ర చికిత్స

Rare Surgery At Ruia Hospit

Rare Surgery At Ruia Hospit

Rare Surgery at Ruia Hospital: తిరుపతి రుయా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం అయింది. పులివెందుల రాజీవ్ కాలనీకి చెందిన 3 ఏళ్ల మహీ నాలుగు రోజుల క్రితం ప్లాస్టిక్ క్యాప్‌ను మింగడంతో అది ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయింది. దగ్గు, శ్వాసకోశ సమస్యలతో రుయా ఆసుపత్రికి తీసుకువచ్చిన చిన్నారిపై నిర్వహించిన సీటీ స్కాన్‌లో ప్లాస్టిక్ క్యాప్ స్పష్టంగా కనిపించింది. వెంటనే వైద్యులు అత్యవసర శస్త్రచికిత్సకు నిర్ణయించారు. పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ఏ.బి. జగదీష్ నేతృత్వంలోని వైద్యబృందం రిజిడ్ బ్రోంకోస్కోపీ సాంకేతికతతో ఆ క్యాప్‌ను విజయవంతంగా బయటకు తీశారు. ఇలాంటి ప్రక్రియను నిర్వహించడం రుయా ఆసుపత్రిలో ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు. చిన్నారి మహీ ప్రస్తుతం పూర్తిగా కోలుకుని, సాధారణ ఆరోగ్యంతో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా, ఇప్పటికే తిరుపతి రుయా ఆస్పత్రిలో ఎన్నో అరుదైన శస్త్ర చికిత్సలు చేసిన విషయం విదితమే.

Read Also: అందాల ఆరాధనగా మెరిసిన కృతి శెట్టి –స్టైలిష్ లుక్‌తో కళ్ళు చెదిరే అందాలు!

Exit mobile version