నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి రోగి ప్రాణాన్ని కాపాడారు. వికారాబాద్ జిల్లాకు చెందిన పేషంట్ వి.కవిత (35)కు యూరాలజిస్ట్ డాక్టర్లు ఎలెక్టివ్ హిస్టరీ సిజేరియన్ ఆపరేషన్, హిస్టరీ విత్ బ్లాడర్ రిపేర్ చేశారు. ఈ నెల 1వ తేదీన తీవ్ర రక్తస్రావంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుండి కవిత కుటుంబ సభ్యులు నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. 27 వారాల గర్భవతి అయిన కవిత.. ఇన్ బ్రాకెట్స్ జి ఫోర్, ప్లాసెంటా పర్క్రిటా విత్ బ్లాడర్ ఇన్వెన్షన్ అనే అరుదైన ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారని నీలోఫర్ వైద్యులు గుర్తించారు.
Also Read: Medaram Jatara 2025: నేటి నుంచి మేడారం చిన్నజాతర.. భారీగా తరలివస్తున్న భక్తులు!
యూరాలజిస్ట్ వైద్యులు ఈ నెల 10న కవితకు ఎలక్షన్ ఎలెక్టివ్ హిస్టరీ సిజేరియన్ ఆపరేషన్, హిస్టరీ విత్ బ్లాడర్ రిపేర్, మూత్రాశయం మీద ఉన్న అద్దె చీలికలను సరి చేశారు. ఈ క్రమంలో ఆమెకు 30 ప్యాకెట్ల రక్తం ఎక్కించినట్లు నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ రవికుమార్ తెలిపారు. ఒక కిలో బరువు ఉన్న మగ శిశువుకు ఆమె జన్మనిచ్చింది. శిశువును ప్రస్తుతం ఎన్ఐసియు విభాగంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిలోఫర్ వైద్యులు తెలిపారు. ఈ అరుదైన శస్త్రచికిత్సలో నీలోఫర్ గైనకాలజిస్టులు, యూరాలజిస్టులు పాల్గొని విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.