Site icon NTV Telugu

Father-Son Duo: క్రికెట్‌లో అరుదైన ఘట్టం.. మొదటిసారి తండ్రీ–కొడుకుల జోడీ.. వీడియో వైరల్

Father Son Duo

Father Son Duo

Father-Son Duo: ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఎన్నో విడ్డురాలు చూసే ఉంటాము. అయితే ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) 2025–26 సీజన్‌లో మరో అరుదైన ఘట్టం నమోదయ్యింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ (41) తన కుమారుడు హసన్ ఈసాఖిల్ (19)తో కలిసి ఒకే జట్టుకు ఆడారు. సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ధాకా క్యాపిటల్స్, నోవాఖాలి ఎక్స్‌ప్రెస్ మ్యాచ్‌లో ఈ తండ్రీ–కొడుకుల జోడీ కలిసి 53 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడం కూడా ఓ విశేషమే అని చెప్పాలి.

7,200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 512GB స్టోరేజ్ తో Vivo Y500i సైలెంట్గా లాంచ్

నోవాఖాలి ఎక్స్‌ప్రెస్ తరఫున ఆడిన హసన్ ఈసాఖిల్‌కు ఆ మ్యాచు బీపీఎల్‌లో తొలి మ్యాచ్ కావడం విశేషం. డెబ్యూ మ్యాచ్‌ లోనే అతను 60 బంతుల్లో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మరోవైపు తండ్రి మొహమ్మద్ నబీ 17 పరుగులు చేసి అనుభవంతో జట్టుకు అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు కేవలం 30 బంతుల్లోనే 53 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన నోవాఖాలి ఎక్స్‌ప్రెస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోరు సాధించింది. హసన్ ఈసాఖిల్ 92 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, సౌమ్య సర్కార్ 25 బంతుల్లో 48 పరుగులు చేసి కీలక సహకారం అందించాడు. ఈసాఖిల్–సర్కార్ మధ్య 101 పరుగుల భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోర్ అందించింది. ధాకా క్యాపిటల్స్ బౌలింగ్‌లో మొహమ్మద్ సైఫుద్దీన్, తైజుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు తీశారు.

Class 4 Question Issue: చిన్న ప్రశ్న.. పెద్ద దుమారం.. ఛత్తీస్‌గఢ్‌లో కుక్క పేర్ల అప్షన్లపై వివాదం

ఇక టార్గెట్ ఛేదనలో ధాకాను 18.2 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌట్ చేశారు నోవాఖాలి ఎక్స్‌ప్రెస్ బౌలర్లు. దీంతో నోవాఖాలి ఎక్స్‌ప్రెస్‌కు 41 పరుగుల ఘన విజయం దక్కింది. నోవాఖాలి బౌలింగ్ విభాగంలో హసన్ మహ్మద్, మొహమ్మద్ నబీ 23 పరుగులకు 2 తీసి.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ విజయం అందుకున్నారు.

Exit mobile version