Rare Bird: సగం ఆడ-సగం మగ లక్షణాలున్న అరుదైన పక్షిని మీరు చూశారా? దీన్ని న్యూజిలాండ్ శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ మాట్లాడుతూ.. కొలంబియాలో ఇలాంటి అరుదైన పక్షిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆ పక్షి సగం ఆకుపచ్చ, సగం నీలం రంగులతో ఉంది. ఇలాంటివి గత వందేళ్లలో రెండోసారి కనిపించిన అత్యంత అరుదైన పక్షిగా పరిశోధకులు తెలిపారు.
అయితే, ఈ పక్షికి ఆడ, మగ రెండు పునరుత్పత్తి అంగాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. జన్యుపరమైన లోపాలే ఇందుకు కారణమని శాస్త్రవేత్త వెల్లడించారు. ఇలా ఏ జాతి పక్షిలో ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫ్(ఆడ, మగ లక్షణాలు)ను చూడలేదని చెప్పారు. న్యూజిలాండ్‌లో ఇలాంటి పక్షిని తానింత వరకు చూడలేదని ప్రొఫెసర్ స్పెన్సర్ అన్నారు. ఈ పరిస్థితి స్త్రీ కణ విభజన సమయంలో ఏర్పడే లోపం కారణంగా ఇలాంటి పక్షులు పుట్టుకొస్తాయని పేర్కొన్నారు. ఇక్కడ ఒక గుడ్డు, రెండు స్పెర్మ్‌ల ద్వారా రెండుసార్లు ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుందని ప్రొఫెసర్ స్పెన్సర్ వివరించారు.