NTV Telugu Site icon

Rapido: యువతితో ర్యాపిడో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. సంస్థ రియాక్షన్ ఇదే..

Rapido

Rapido

Bengaluru: దేశవ్యాప్తంగా ఉబర్, ర్యాపిడో, ఓలా సేవల వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతి రోజు వేల సంఖ్యల్లో ర్యాపిడో, ఉబర్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ట్రాన్స్‌పోర్టేషన్ కోసం వాటినే వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వాటికి అదరణ కూడా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ర్యాపిడో సేవలను వినియోగించుకున్న ఓ బెంగళూరు యువతికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాపిడో బైక్ డ్రైవర్‌ సదరు యువతి పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించాడు.

Also Read: CM Revanth: పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

దీంతో ఆ యువతి ర్యాపిడోకు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ అతడిపై చర్యలు తీసుకున్న శనివారం బెంగళూరులో చోటుచేసుకుంది . వివరాలు.. బెంగళూరుకు చెందిన ఓ యువతి శనివారం రాత్రి 8:30 సమయంలో టిన్‌ ఫ్యాక్టరీ నుంచి కోరమంగళకు వెళ్లేందుకు ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. ఈ క్రమంలో ఆమెను పిక్ చేసుకున్న డ్రైవర్ తనతో అసభ్యంగా వ్యవహరించాడు. తన ఫోన్‌లో బ్యాటరీ తక్కువగా ఉందని చెప్పి రూట్ నావిగేట్ చేయడానికి డ్రైవర్ తన ఫోన్‌ కావాలని అడిగాడని, అంతేకాదు తన పర్సనల్ విషయాలు అడిగాడని.. పెట్రోల్ పంపులో తనను రెండు సార్లు అభ్యంతరకరంగా తాకాడని ఆమె ర్యాపిడో సంస్థకు ఫిర్యాదు చేసింది.

Also Read: Health Tips : చలికాలంలో వీటిని తీసుకుంటే చాలు..అద్భుతమైన ఆరోగ్యమైన ప్రయోజనాలు మీసొంతం..

ఆమె ఫిర్యాదుపై స్పందించిన ర్యాపిడో వెంటనే ఆ డ్రైవర్‌పై చర్యలు తీసుకుంది. అతడి ఐడీని సస్పెండ్ చేసింది. దీనిపై బాధిత యువతి స్పందిస్తూ.. తాను ఎంతోకాలంగా ర్యాపిడో యాప్ ఉపయోగిస్తున్నానని, కానీ ఇలాంటి అనుభవం తనకు ఎప్పుడూ ఎదురుకాలేని పేర్కొంది. డ్రైవర్‌ తీరుపై ఫిర్యాదు చేయగా.. ఈ ఘటనను పరిశీలించిని డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటాని ర్యాపిడో సంస్థ వెల్లడించినట్టు బాధితురాలు చెప్పింది. తను ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే ఆ డ్రైవర్ ఐడీని సస్పెండ్ చేసినట్టు ర్యాపిడో ప్రకటించిందని ఆమె తెలిపింది.

Show comments