Site icon NTV Telugu

Dhuarandhar 2 : ఒక్క అడుగు దూరంలో..ధురంధర్ 2

Dhurandhar 2

Dhurandhar 2

రణవీర్ సింగ్ హీరోగా.. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ దగ్గర కీలక మైలురాయికి చేరువలో ఉంది. కేవలం 32 రోజుల్లోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ లైఫ్ టైమ్ కలెక్షన్స్ దాటేసిన ఈ సినిమా, ఇప్పుడు ‘బాహుబలి 2’ని టార్గెట్ చేసింది. సాధారణంగా ఏ సినిమాకైనా నాలుగో వారం తర్వాత వసూళ్లు తగ్గుముఖం పడతాయి. కానీ ‘ధురంధర్’ విషయంలో అది రివర్స్ అవుతోంది. ఐదో వీకెండ్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తూ, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1783 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రూ. 1800 కోట్ల చేరువలో ఉంది.

Also Read : Tollywood Box Office Crisis : తెలుగు ఇండస్ట్రీకి ఏమైంది? మూడు నెలలుగా ఒక్క హిట్‌ లేని టాలీవుడ్‌

ఇప్పటికే పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేసి మూడో ప్లేస్‌లోకి దూసుకొచ్చిన ధురంధర్ 2.. బాహుబలి 2 రికార్డు బ్రేక్ అవ్వడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. కేవలం ఇండియాలోనే రూ.1153 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సత్తా చాటుతోంది. కొన్ని దేశాల్లో ఈ చిత్రంపై నిషేధం ఉన్నప్పటికీ, ఓవరాల్ ఓవర్సీస్‌లో రూ.423 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. ఇండియాలో గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే రూ.1360 కోట్లకు చేరుకున్నాయి. ఈ జోరు చూస్తుంటే బాహుబలి 2ని వెనక్కి నెట్టి ఇండియన్ ఆల్ టైమ్ టాప్ 2 సినిమాగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. అయితే రూ.2000 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అవడం మాత్రం కష్టమనే చెప్పాలి. కానీ, ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్న బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేస్తే.. ధురంధర్ 2 ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసినట్టే. ఏదేమైనా.. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ.. ఒక నెల రోజులుగా బాక్సాఫీస్ దగ్గర నాన్ స్టాప్‌గా దూసుకుపోతోంది ధురంధర్ 2.

Exit mobile version