Site icon NTV Telugu

Lawyer Swapna Murder Case: న్యాయవాది స్వప్న మర్డర్ కేసులో మరో ట్విస్ట్..

Lawyer Swapna Murder Case

Lawyer Swapna Murder Case

Lawyer Swapna Murder Case: రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లిలో లాయర్ స్వప్న(34) హత్య చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా న్యాయవాది స్వప్న మర్డర్ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. చెల్లిని చంపిన సొంత అన్న కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే స్వప్న అన్న రాజుతో పాటు ఇద్దరి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్వప్న లొకేషన్ వివరాలు ఎప్పటికప్పుడు రాజుకు చేరవేసిన శేఖర్ అనే మరో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. గతంలోనూ రెండు సార్లు స్వప్నను హత్య చేసేందుకు ప్రయత్నించినట్టు రాజు విచారణలో ఒప్పుకున్నాడు. ఒకసారి కారుతో మరోసారి బుల్డోజర్‌తో స్వప్నను ఢీ కొట్టించే ప్రయత్నం చేశాడు రాజు. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా మలిచేందుకు ప్లాన్ చేశాడు. రెండు ఘటనల నుంచి స్వప్న తప్పించుకుంది. సీసీ కెమెరాలు లేని ప్రదేశాలు చూసి స్వప్నను వెనుక నుంచి ఢీ కొట్టేందుకు రాజు ప్లాన్ చేశాడు. ప్లాన్ సక్సెస్ చేసేందుకు తన స్నేహితులు వీరేష్, శివ, శేఖర్ సహాయం తీసుకున్నాడు. ఈ రోడ్డు ప్రమాదం కేసులను హత్యాయత్నం కేసులుగా పోలీసులు మార్చనున్నారు.

READ MORE: EC-Elections: 4 రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ కసరత్తు పూర్తి.. షెడ్యూల్ ఎప్పుడంటే…!

Exit mobile version