NTV Telugu Site icon

Rana : నిర్మాతగా రాణించాలి అనుకుంటున్న రానా..?

Whatsapp Image 2023 06 09 At 9.40.06 Pm

Whatsapp Image 2023 06 09 At 9.40.06 Pm

టాలీవుడ్ టాప్ నిర్మాత సురేశ్‌ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటన తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రానా. భిన్నమైన కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు.రానా ఇప్పటికే రానానాయుడు వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోనూ తన సత్తా ఏంటో చూపించారు. అయితే రానా నటుడిగా కాక, నిర్మాతగా సక్సెస్‌ అవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.రానా, బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమౌతున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమాలో రానా మరియు వరుణ్‌ ధావన్‌ హీరోలుగా నటించడం లేదని తెలుస్తుంది.. వరుణ్‌ ధావన్‌ హీరోగా రానా ఈ సినిమాను నిర్మించబోతున్నారని సమాచారం.. ఈ చిత్రం నిర్మాణంలో రానాతో పాటు సునీల్‌ నారంగ్‌ కూడా భాగస్వామ్యులు కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం అయితే రావాల్సి ఉంది. అలాగే మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌తో రానా ఓ సినిమాను నిర్మించ బోతున్నట్లు సమాచారం.

ఇలా గతంలోనూ రానా పలు సినిమాలకు నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు నటుడిగా మరోవైపు నిర్మాతగా బాగా బిజీగా ఉంటున్నారు రానా. వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ తాను సినిమాలు చేస్తూనే అటు నిర్మాత గా కూడా కొనసాగాలని చూస్తున్నారట. ఇక రానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రొడక్షన్‌పై కొన్ని కామెంట్స్ చేశారు. ”నేను నటుడిని కాక ముందు పెద్ద సవాలును అయితే ఎదుర్కొన్నాను. నిర్మాతగా మారాలా.. లేదంటే నటుడిని అవ్వాలా.. అని చాలా సార్లు ఆలోచించానని ఆయన చెప్పుకొచ్చాడు.నేను మొదటిసారి నిర్మాతగా మారి ‘బొమ్మలాట’ అనే సినిమాను 2005 లో తీశాను. దానికి రెండు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. కానీ, ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. చిన్న సినిమాలు విడుదల అవ్వాలంటే ఎంత కష్టపడాలో నాకు అప్పుడే అర్థం అయింది.. నాకు నచ్చిన కొన్ని కథలను తెరకెక్కించాలని ఎంతోమంది దర్శకులను, టెక్నిషియన్స్‌ను కూడా కలిశాను. కొత్త కథలను తీసుకురావాలంటే సినీ పరిశ్రమలో ఎంతో కష్టమని కూడా అర్థం అయింది. అందుకే తప్పక నేను యాక్టర్‌ని అయ్యాను” అని చెప్పుకొచ్చారు.