Site icon NTV Telugu

Rana Daggubati: కొత్త కంటెంట్ కోసమే నా అన్వేషణ: రానా

Rana Daggubati

Rana Daggubati

Rana Daggubati: నటుడిగా, నిర్మాతగా వైవిధ్యమైన బాటలో సాగుతున్న రానా దగ్గుబాటి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, నిర్మాణంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సినిమాలో ఫ్యామిలీ డ్రామాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుందని రానా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సంక్రాంతి వంటి పండుగ సీజన్లలో ఎన్ని కుటుంబ కథా చిత్రాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

READ ALSO: War Effect in Tirupati : తిరుపతిపై యుద్ధం ఎఫెక్ట్.. రేపటి నుండి కమర్షియల్ గ్యాస్ సరఫరా బంద్..!

“మంచి కథలను వెతికి ప్రేక్షకులకు అందించడమే నా లక్ష్యం. ఇప్పుడున్న ఆడియెన్స్ కూడా కొత్తదనంతో కూడిన కంటెంట్‌నే కోరుకుంటున్నారు. అందుకే ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించడానికి నేను ఎప్పుడూ ముందుంటాను” అని రానా చెప్పుకొచ్చారు. నటనతో పాటు తనకు టెక్నాలజీపై ఉన్న మక్కువను బయటపెట్టారు. “యాక్టింగ్‌లోకి వచ్చినా టెక్నాలజీ గురించి నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నాను. ఆసక్తి ఉన్న విషయంలో రిస్క్ తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా లక్ష్యం చేరేవరకు పోరాడాలి” అని చెప్పుకొచ్చారు. రానా సమర్పణలో వచ్చిన ‘విరాట పర్వం’, ‘గార్గి’, ‘35 చిన్న కథ కాదు’ వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రతిష్టాత్మక అవార్డులను కూడా గెలుచుకున్నాయి. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన్న ‘కాంత’ చిత్రంలో రానా నటించి, ఆ చిత్ర నిర్మాణంలోనూ భాగస్వామిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

READ ALSO: Stock Market Crash: యుద్ధ భయంతో కుప్పకూలిన సూచీలు! లక్ష కోట్లు ఆవిరి..

Exit mobile version