NTV Telugu Site icon

Vettaiyan : తలైవాకు విలన్ గా రానా దగ్గుబాటి..?

Whatsapp Image 2024 04 16 At 9.54.04 Am

Whatsapp Image 2024 04 16 At 9.54.04 Am

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ “జైలర్” సినిమాతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు. అప్పటి వరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడ్డ తలైవా జైలర్ సినిమాతో భారీ విజయం అందుకున్నారు.. రజనీకాంత్ కెరీర్ లోనే భారీ కలెక్షన్స్ జైలర్ సినిమాకు వచ్చాయి. జైలర్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో వున్న రజనీకాంత్. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన లాల్ సలామ్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించారు.. కానీ ఆ సినిమా ఊహించని డిజాస్టర్ గా నిలిచింది.. ప్రస్తుతం రజనీకాంత్‌ వరుస సినిమాలతో బిజీగా వున్నారు..రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్‌’ ఈ సినిమాను .’జై భీమ్‌’ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నది. కమర్షియల్ హంగులు కలబోసిన సామాజిక సందేశాత్మక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ పాన్‌ ఇండియా చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా మరియు రితికా సింగ్‌ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రానా విలన్ పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. విద్యా వ్యవస్థలోని అవినీతి మరియు అరాచకాలను చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టెక్నాలజీపై మంచి పట్టున్న స్టైలిష్‌ విలన్‌ పాత్రలో రానా నటిస్తున్నాడు.. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఈ చిత్రం తరువాత రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు. తలైవా 171 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.దర్శకుడు లోకేష్ ప్రస్తుతం ఈ సినిమా పూర్తి కథను సిద్ధం చేసే పనిలో వున్నారు..విశ్వనటుడు కమల్ హాసన్ కు విక్రమ్ వంటి భారీ హిట్ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు తలైవా కు కూడా భారీ హిట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు..