NTV Telugu Site icon

Ram Mohan Naidu: దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి..

Ram Mohan Naidu

Ram Mohan Naidu

Ram Mohan Naidu: కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలో జరిగిన దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ కు కావాల్సిన భూమి చూపించలేకపోయిందని., ఈ కారణంగానే రైల్వే జోన్ ప్రక్రియ ఆలస్యం అయ్యిందని., రైల్వే జోన్ కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందని., కూటమి ప్రభుత్వం రైల్వే జోన్ ను టాప్ ప్రియారిటీగా తీసుకుందని అన్నారు. రైల్వే జోన్ కు కావాల్సిన భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించామని., దివ్యాంగుల కోసం ప్రత్యేక స్కిల్ ట్రెయినింగ్ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Hop On Kangaroo: విద్యార్థులు విదేశాలకు వెళ్లి స్టార్ ప్లేయర్స్‌తో గేమ్స్‌ ఆడాలనుకుంటున్నారా..? ఇలా చేస్తే సరి..

శ్రీకాకుళం లో దివ్యాoగుల కోసం 2 కోట్ల 98 లక్షల విలువైన పరికరాలు పంపిణీ చేసాము. ఎంపీ లాడ్స్ గా నా వంతు నుంచి 30 లక్షలు ఇచ్చి కేంద్రం నుంచి రావలసిన పరికరాలు వచ్చాయి. మూడు వేల పెన్షన్ ను 6వేలు చేసిన ఘనత చంద్రబాబు గారికి దక్కుతుంది. ఏ సమస్య ఉన్న చెప్పండి పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇస్తున్నని., స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు కూడా అవకాశం కల్పిస్తామని., ప్రతి నెల ఒక పూట కలెక్టరేట్ లో దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ పెట్టాలని.. మూగ చెవిటి వారి కోసం ట్రాన్స్ లెటర్ ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన అన్నారు. ఇక ఈ ప్రభుత్వం మీ కోసం ఉంది. మీ వైపు నుంచి ఏ సమస్య ఉన్న చెప్పండి. పరిష్కారం కి కృషి చేస్తాం. ఈ రోజు 479 మందిని గుర్తించాం.. సుమారు 800 పరికరాలు తెప్పించాం., అమరావతి రాజధాని కోసం కేంద్రం నుండి 15 వేల కోట్లు సాధించుకున్నాం., పోలవరం పూర్తి చేస్తామని కేంద్రం కూడా హామీ ఇచ్చిందని ఆయన అన్నారు.

TG Bharath: శ్రీసిటీ త‌ర‌హాలో ఇండ‌స్ట్రియ‌ల్ జోన్ల‌ను త‌యారుచేయాలి.. మంత్రి టి.జి భ‌ర‌త్..

Show comments